28, ఏప్రిల్ 2009, మంగళవారం

వీడుకోలు



నేస్తమా నిన్నొదిలి వెళ్ళిపోతున్నాను
నీవెంత వేచినా మరలి రాలేను!

నామనసు గదులలో నీవె వున్నావు
జ్ఞాపకాల పొరలలో మిగిలిపొతావు
వీడుకోలు చెప్పను మనసు రాకున్నాది
కన్నీటితెర వెనుక నీ రూపు నిలిచింది!

కానీ,
నేస్తమా నిన్నొదిలి వెళ్ళిపోతున్నాను
నీవెంతవేచినా మరలిరాలేను!

గతమంత కొండగా నాముందునిలిచింది
ఒక్కొక్క జ్ఞాపకం నా గుండె పిండింధి
నాకాళ్ళబంధమై అడుగేయనీనంది!

అయినా,
నేస్తమానిన్నొదిలి వెళ్ళిపోతున్నాను
నీవెంతవేచినా మరలి రాలేను!

19, ఏప్రిల్ 2009, ఆదివారం

మధుర భావం-4

పాడు వసంతం ,మళ్ళీ వచ్చింది!
కోయిల పాటల వసంతం,
మామిడిచిగురుల వసంతం

పచ్చని ఆకుల వసంతం,
వెన్నెల జల్లుల వసంతం

నీవిరహంలో గుబులును రేపేవసంతం

నీ ఙాపకాలను కెలికి వదిలే వసంతం
ప్రియా!నీకంటే ముందే..........

పాడు వసంతం ,మళ్ళీ వచ్చింది!

14, ఏప్రిల్ 2009, మంగళవారం

రాజ నీతి


ఒక రాజ్యాన్ని ఒక రాజు పాలించేవాడు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు.ఒకసారి రాజసభ జరుగుతున్నాది.సభ మొదలయ్యి అరఘంట అయ్యింది.మహామంత్రి,సైనికాధికారి,ఒకభటుడు,ముగ్గురూ ఆలశ్యంగా సభకు వచ్చారు.రాజుకు కోపం వస్తుంది.భటుడికి నూరు కొరడా దెబ్బలు శిక్ష విధిస్తాడు.సైనికాధికారినిబాగాతిట్టి ఇకపై ఇలాచేస్తే ఉద్యోగంలోంచీ
తీసివేస్తానని బెదిరిస్తాడు. సైనికాధికారి అవమానంతో తలదించుకొంటాడు.ఇక తప్పుచేసిన మహామంత్రి వైపు తిరిగి రాజు ఇలా చెప్తాడు. "మహామంత్రీ! మీరుకూదా ఇలా చేస్తే ఎలా!"
మంత్రి తలదించుకొంటాడు.ఒకే తప్పు చేసినముగ్గురికి రాజు మూడు రకాల శిక్షలు వెయ్యటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
ఆమాటే తర్వాత రాణీ రాజును అడుగుతుంది. అందుకు రాజు ఇలా సమధానంచెప్తాడు. "రాజు శిక్ష విధించేటప్పుడు ఆశిక్షను అనుభవించేవారిమానసిక స్థితిని,సమాజంలో వారి స్థానాన్ని,దృష్టిలో ఉంచుకోవాలి.నూరుకొరడా దెబ్బలు తిన్న భటుదు త్వరలో ఆశిక్షను మర్చిపోతాడు.మళ్ళీఅదే తప్పు చేస్తాడు.నిండు సభలో జరిగిన అవమానానికి సైనికాధికారి ఇక ఆ తప్పు చేయడు.మహా మంత్రికి నేనన్న ’మీరుకూడాఇలా చేస్తే ఎలా’ అన్న మాటచాలు.ఇక జన్మలో ఆ తప్పు చేయడు.కాబట్టి శిక్షలెప్పుడూ వారి వారి సంస్కారాన్ని బట్టి విధించాలికానీ,అందరికీ ఒకే శిక్షనువిధించకూడదు"
(ఎగ్గిక్యూటివ్ పోస్ట్ లో ఉన్నవారికి ఈ కధ ఒకచక్కని మార్గదర్శి. ఇక్కడ మిత్రులు తప్పుకూ,నేరానికీ ఉన్న తేడాను గమనించాలి)

12, ఏప్రిల్ 2009, ఆదివారం

మధురభావం-౩

నీ జ్ఞాపకాలలో ఊరి
నా చెక్కిలి పై నుండి జారి
పెదాలను తడిపిన కన్నీరు
ఎంత తీయగా ఉందో తెలుసా ప్రియా!

5, ఏప్రిల్ 2009, ఆదివారం

మధురభావం-2

మంచు కురిసిన రాత్రిలో
వెన్నెలలో తడుస్తూ నిల్చున్నా
ఎందుకంటే మంచు వెన్నెలే
నిన్ను కూడా తడుపుతూఉంటుందన్న నెనపుతో!

మధురభావన -1

ఎక్కింతలతో ప్రొద్దుటి నుంచి వేగుతున్నా
చన్నీరు త్రాగను కూడా వెనుకాడుతున్నా
ఎందుకో తెలుసా ప్రియా !
తలచుకొంటున్నది
నీవైతే
మరికొంత
సేపు నీ తలపుల్లో నిలిచి ఉందామని!

4, ఏప్రిల్ 2009, శనివారం

జ్ఞానోదయం

ఒక రాజ్యాన్ని విజయకేతుడు అనే రాజు పాలించేవాడు.రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండసాగారు.ఆ రాజ్యం పైకి శత్రు రాజులు దండెత్తి వచ్చారు. హోరా హోరీగా జరిగినయుధ్దంలో విజయకేతుడు ఓడిపోతాడు.రాజ్యం శత్రురాజుల పరమౌతుంది.రాజు ప్రాణాలతో తప్పించుకొంటాడు కానీ శత్రు సైనికులు అతన్ని వెంటాడుతారు. రాజు పరిగెత్తి పరిగెత్తి ఒక కొండమీ దికి చేరుకొంటాడు . ఆపైన ఇక దారి లేదు. వెనుకసైనికులు తరుముకొస్తున్నారు. ముందు దారిలేదు. ఇక కొండపై నుండి క్రిం దికి దూకడం ఒకటే మార్గం.రాజు క్రిందికి దూకబోతూండగా ఒక స న్యాసి వడివడి గా అక్కడికి వస్తాడు.రాజు చేతిలో రెండు చీట్లు పెట్టిఇలా చెబుతాడు
"రా జా! ఈ రెండు చీట్లలో ఒకదానిమీద '1' ఇంకొక దానిమీద '2' అని వేసివున్నాయి. నీకు అత్యంత విషాదము కల్గినప్పుడు 1 నెంబరు చీటి చదువుకో.అత్యంత సంతోషం కలిగినప్పుడు 2 నెంబరు చీటి చదువుకో" అని చెప్పేసి వెళ్ళి పోతాడు. ప్రాణాలు పోతున్న ఈ సమయం కంటే ఇక కష్ట సమయం ఇంకేముంటుంది అనుకొని రాజు మొదటి చీటీ తీసి చదువుతాడు.అందులో ఇలా ఉంటుంది. "ఇది శాశ్వతం కాదు" ఈ అశాశ్వతమైన కష్టం కోసం ఆత్మహత్య చేసి కోవటం అనవసరమని రాజు గ్రహిస్తాడు. ఒక కొండ చెరియ చాటున దాక్కుంటాదు .శత్రు సైనికులు రాజు మరణించాడనిభావించి వెళ్ళిపోతారు.
కొద్దిరోజులు గడుస్తుంది.రాజు సైన్యాన్ని సమకూర్చుకొని యుద్ధం చేసి తన రాజ్యాన్ని తిరిగి పొందుతాడు. రాజ్యం లోని ప్రజలందరూ పెద్దపెట్టున సంబరాలు జరుపుకొంటూంటారు.రాజుకూడా సంతోషంగా అందులో పాలు పంచుకొంటాడు.ఆ సంతోష సమయంలో రాజుకు రెండవచీటీ గుర్తుకు వస్తుంది. ఇంతకంటే సంతోష సమయం ఇంకేముం టుంది అనుకొని రాజు రెండవ చీటీ చదువు తాడు .అందులో ఇలాఉంటుంది "ఇదీ శాశ్వతం కాదు" రాజు తల వంచుకొని లోనికి వెళ్ళి పోతాడు.

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!