తిరిగి వచ్చిన జయచంద్ర .
జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
28, మార్చి 2020, శనివారం
27, జులై 2019, శనివారం
ఎర్ర బంతి ఎలక్షన్లు
ఎలక్షన్ రిసల్ట్ వఛ్చిన రోజు నాకు నిద్ర పట్టలేదు .ప్రజాస్వామ్య భారతం లో ఒక మహాద్భుతం జరిగింది. ఇప్పటి వరకు జరగనిది . మన రాజకీయ పార్టీలు తమకెన్ని సీట్లు రాబోతున్నాయో ముందుగానే చెప్పేసాయి. అదిగాదు అద్భుతం. ఏ పార్టీ అయినా తమకు ఎక్కువ సీట్లు వస్తాయనే చెబుతుంది. ఇది ఎప్పుడూ జరిగేదే. కానీ ఖచ్చి తంగా వారుచెప్పినన్ని సీట్లే రావటం అద్భుతం. ప్రజాస్వామ్యం లో ఇది సాధ్యమా? ఆలోచనలతో నిద్ర పట్టలేదు .
ఏమిజరిగింది? ఎక్కడో ఏదో అపశృతి విన్పిస్తూఉంది. ఎక్కడ? ఎలా? అంతా మిస్టరీ గా అన్పించింది. ఆ ఆలోచనల మధ్య ఎప్పుడో తొలి కోడి కూస్తున్నప్పుడు ఒక జ్యోతి వెలిగింది. నేను స్కూలులో చదువుతున్నప్పుడు జరిగిన సంఘటన నా మదిలో మెదిలింది.
నా స్కూలు డేస్ లో ఒక మెజీషియన్ మా స్కూలుకు వచ్చ్చాడు. స్కూలులో అతనిచ్చ్చిన ప్రదర్శన లో ఒక గ్రీన్ కలర్ బాక్స్ ను టేబుల్ మీద ఉంచాడు. పక్కనే రంగు రంగుల బంతులున్నాయి ,ఎరుపు రంగు బంతి తప్ప. అతనిలా చెప్పాడు. " మీలో ఒకరు వచ్చి ఇక్కడుండే బంతుల్లో ఒకటి బాక్సు లో వేయండి. మీరు ఏ బంతి వేసినా , నేను ఎర్రబంతిని బయటకు తీస్తాను. మీ ముందే ఇది జరుగుతుంది. " బంతి ని బాక్సు లో వేసే అవకాశం నాకే వచ్చ్చింది .నేనే వెళ్లి తెల్లబంతిని బాక్సు లో వేశాను. అతను ఏవో మంత్రాలు చదివాడు. మ్యాజిక్ గుడ్డ ను బాక్సు మీద వేసి తీశాడు . కొంత సేపు తర్వాత ఆ గ్రీన్ కలరు బాక్సును పైకెత్త్తి ఆకాశానికి చూపించి క్రింద పెట్టాడు. ఆ బాక్సును బోర్లించాడు. ఆశ్ఛర్య కరంగా దాని లొంచి ఎర్రబంతి క్రింద పడింది. చప్పట్లతో హాలు మారు మ్రోగింది. అందరికి ఒకటే ఆశ్ఛర్యం. తెల్ల బంతి ఎర్రగా ఎలా మారింది? ??
ఆ రోజు రాత్రి కూడా నాకు నిద్ర పట్టలేదు. ఎంత మ్యాజిక్ అయినా లాజిక్ కు అందాలి గదా? రెండో రోజు స్కూల్లో ఆ మెజీషియన్ దగ్గరికెళ్లి అడిగాను, ఎలాజరిగిందో చెప్పమని. ఒక పట్టాన చెప్పలేదు. చివరికి నా ఉత్సుకత చూసి ముచ్చ్చటేసి అసలు విషయం చెప్పాడు. అది విని ఆశ్చర్య పోవటం నావంతయ్యింది.
మంత్రాలు చదివే గందర గోళంలో అతను బాక్సు ను మార్చేశాడు. నేను తెల్ల బంతి వేసిన బాక్సు వేరు. అతను ఎర్ర బంతి తీసిన బాక్సు వేరు. రెండు బాక్సు లు ఒకేలా ఉన్నాయి. అతను ముందే చెప్పిన ఎర్రరంగు బంతి వేరే బాక్సు లో రెడీ గా ఉంది. ఈ బాక్సు ను దాచేసి ఆబాక్సు ను బోర్లించాడు. అలా అతను ముందే చెప్పిన రంగు బంతిని బాక్సు లో నుంచి తీయ గలిగాడు.
ఇప్పుడు నాకు అంతా అర్ధమయ్యింది. మబ్బులు విడి పొయ్యాయి. నాకు నిద్రపట్టింది.
16, జులై 2019, మంగళవారం
బ్రతుకు బొంగరం .
ఈ బ్రతుకు బొంగరం లాగ గిర్రున తిరుగుతూంటుందెందుకో
గిరా గిరా తిరిగే టప్పుడు ఏదీ స్పష్టంగా కనిపించదు
నిలిచిన తర్వాత చూద్దామంటే బ్రతకు బొంగరమాగినా
ఈ తనువు ఇంకా గిర్రున తిరుగుతూనే ఉంటుంది. .
అప్పుడు కూడా ఏది కనిపించదు .
ఆ బ్రతుకు బొంగరామాగి ,ఈ తనువు తిరగటం మానినా
ఈ ప్రపంచమంతా గిర్రున తిరుగుతున్నట్లే ఉంటుంది
కన్నులకు.
16, డిసెంబర్ 2018, ఆదివారం
26, అక్టోబర్ 2014, ఆదివారం
25, ఆగస్టు 2011, గురువారం
నేనెందుకిలా 17
ఆరోజు శుక్రవారమనుకుంటాను..ఏమిటో! ఇంత చిన్న వయసులోనే ఏమీ గుర్తుండటం లేదు.ఈ ఇంట్లో, ఈ గదిలో ఎన్నిరోజులిలా?
ఏమీ చెయ్యకుండానే ఈ జీవితం గడిచి పోతుందా? బాల్యంలోనే వృద్దురాలినయ్యానా?ఉదయాన్నే లేచి కిటికీ ఊచలు పట్టుకోని వీధిలోకి చూస్తూనిల్చున్నాను.ఇధి నా దైనందిన చర్య అయిపోయింది.స్కూళ్ళకు పోయే పిల్లలు, ఆఫీసులకు పోయేవారు, వీధంతా సందడి సందడిగా ఉంటుందికానీ ఈ చైతన్యంలో నేను భాగస్వామిని కాలేను.ఈ సమాజం లో నేను ఇమడ లేను.నాకన్నులలోంచీ రెండు కన్నీటి బొట్లు బుగ్గలపైనుండీ జారాయి. ఈమధ్య ఇంట్లో వారుకూడానాతో మాటలు బాగా తగ్గించేశారు.శివా కూడా నాతో మునుపటిలా మాట్లాడటం లేదు..ఇదంతా నాఊహేకావచ్చు.కానీ కొంత నిజం కూడా లేక పోలేదు. ...............ఆలోచిస్తున్న నేను ఉలిక్కి పడ్డాను.బయట ఏదో గోల గోలగా ఉంది.పాటలు,నవ్వులూ అరుపులుతో ఒక గుంపు ఎదురింటిలోకి చొరబడుతూంది.వాళ్ళెవ్వరో ఊహించి నా ఒళ్ళు చెమటలు పట్టింది.ఎదురింట్లో బిడ్డను ఆశీర్వదించి డబ్బులు తీసుకోడానికి వచ్చిన కోజ్జాల గుంపది.
చిన్న తనంలో అటువంటి వాళ్ళను చూస్తే ఎంత సరదాగా ఉండేదో !వాళ్ళ చుట్టూ మూగిపోయే వాళ్ళం .కానీ నా జీవిత గమనంలో వారు భాగ స్వాములు అవుతారనీ అసలు వారే నాజీవన నావకు చుక్కానులవుతారనీ ఆరోజు ఊహించనయినా లేదు.వారు గుంపు గా పాటలు పాడుతూంటే నా మనసు లో ఏవో సంతోష తరంగాలు లేస్తున్నాయి.ఒళ్ళంతా తుళ్ళుతున్న అనుభూతి.నాకు తెలీకుండానే కాళ్ళు అటువైపు లాగేస్తున్నాయి.తలుపు తీసుకుని అటువైపు పరుగెత్తాను.మదినిండా సంతోషం.!
ఆరడిపెడుతున్న అత్తింటి చెర వొదిలించుకుని పుట్టింటి వైపు పరుగులెడుతున్న ఉత్సాహం! నా భవిష్యత్తును బందీగా మార్చే శ్రుంఖలాలను
తుత్తునియలు చేసి స్వతంత్ర సామ్రాజ్యం వైపు పరుగులు పెడుతున్న తెగింపు.! ఆగుంపులో కలిసిపోయి వారితో పాటు చప్పట్లు కొట్టటం మొదలుపెట్టాను. పదిహేనుమందికిపైగా ఉన్న ఆ గుంపులో నన్నెవ్వరూ గుర్తించలేరు. కొత్తగా వారితో చేరిన నన్ను అందరూ ఆగి మరీ చూడసాగారు. నేను ముక్కు మీదవేలేసుకుని సీను క్రియేటు చెయ్యవద్దన్నట్టు సైగ చేశాను.దాంతో అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు.
5, ఫిబ్రవరి 2011, శనివారం
నేనెందుకిలా............16
వేగంగా గాలిలో తేలిపోతున్న నాకు ఏమీ కన్పించటంలేదు.చెవులు లేవు గనుక విన్పించటం కూడా మానేసింది.సర్వాంగాలూ కుంచించుకుని ఒకబిందువులో ఇమిడి పోయిన అనుభూతి. ఇప్పుడు నా ఆకారం ఎలా ఉంటుంది?.బ్రతుకంతా నన్ను ఏడిపించుకు తిన్న ఆ శరీరం లేకుండా నే నెలా గున్నాను.కేవలం ఒక బిందువుగా మారిపోయిన నేను ఇప్పుడు పురుషుడినా, స్త్రీ నా?.
నేను పరమాణువులా మారిపోయానా?ఈనిశ్శబ్ధ నిశీధిలో నేనెక్కడికి వెళ్తున్నాను?మరణంతర్వాత మరోజన్మను వెతుక్కుంటూ వెళ్తున్నానా?
ఇంత జరిగినా నాలో ఆలోచనలు అణగారి పోలేదు. ఆలోచిస్తున్నది ఈ మనసేనా? మనసంటే ఆత్మేనా? ఆహా! మరణం తర్వాతి ఈ రహశ్యం
ఎంత బాగుంది? ఇదంతా నేను ఎవరికైనా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.కనీసం నిశ్చలకైనా!కానీ నేను చూడలేను.చెప్పలేను.ఎంత దౌర్భాగ్యం?
ఈ సృష్టి రహశ్యం తెలుసుకున్నా ఎవ్వరి కీ చెప్పలేని దురదృష్టవంతురాలిని.మన ఋషులూ,యోగసాధకులూ,చెప్పినది కొంతవరకూ నిజమేనని,ఈ ఆలోచించే మనసు ఎల్లవేళలా మనతోనే ఉంటుందనీ,ఎవరికైనా చెప్తేబాగుణ్ణు.కానీ ఎలా?
వేగంగా వెళ్తున్న నేను ఆగిపోయిన అనుభూతి.కళ్ళు చించుకొని చూడటానికి ప్రయత్నించాను.కళ్ళు లేవు. కానీఇదోపిచ్చిప్రయత్నం.అన్నీఉన్నట్టేఅనుభూతి.శరీరంలేని మనసు ఎంత దుర్భరంగా ఉంది?శరీరం ఉన్నప్పుడు దాన్ని ఎంత తిట్టుకొనేదాన్ని!నాజన్మను తలచుకొని విలపించని రోజుందా? కానీ అప్పుడెంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తూంది
మళ్ళీ కదలిక మొదలైంది.ఈసారి చాలానెమ్మదిగా.కదలికలోవేగం తగ్గింది.ఆలోచనల్లో కూడా! అన్ని అవయవాల్లాగే మనసు కూడా క్రమంగాపని చేయడం మానేస్తుందేమో.ఙాపకాలు నన్ను విడిచి వెళ్ళిపోతాయేమో. అప్పుడు మనసు కూడా శూన్యమౌతుందేమో? నాకు చలి, వేడి, ఏమీ తెలీటం లేదు.నేను జీవించి ఉండగానే కాదు. మరణించాక కూడా దురదృష్ట వంతురాలినే.నేను చనిపోయి
ఎన్ని రోజులయ్యింది? నెలలా , సంవత్సరాలా? ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? నిశ్చల ఎలా ఉంటుంది? ఆరోజు........నాజీవితాన్ని మలుపు తిప్పిన రోజు, నన్ను గమ్యంవైపు నడిపిన రోజు,
ఆ గమ్యం మంచిదా చెడ్డదా అని తెలియకుండానే అటువైపు అడుగులేసిన రోజు, నా జీవితకాలంలో ఎంత ముఖ్యమైన రోజది?
************************************ ***************************** *************************************** *****************************************
నాన్న వద్ద నుంచీ నాగదిలోకి చేరిన నేను ఒక శిల్పంలా మారి పొయ్యాను.మనసు మొద్దుబారిపోయింది.కళ్ళు తెరుచుకొని ఉన్నానేగానీ దేనినీ చూడటం లేదు.నాన్న చెప్పిన మాటలు
చెవుల్లోమారుమ్రోగుతున్నాయి." నీ విషయంలో అదిసాధ్యంకాదమ్మా" ఇకనేను బ్రతకటమెందుకు? ఇప్పుడు నేనొక branded కొజ్జాను .నావల్ల ఎవరికీ సుఖంలేదు. మనశ్శాంతి లేదు. పైగా నావిషయంగాఇంట్లో అందరూ ఎన్నోఅవమానాలను ఎదుర్కొంటున్నారు.ఈ విషయం నాకు తెలిసీ తెలియనట్లుగా నటిస్తున్నాను. దసరా పండుగలొస్తే మా వీధంతా సందడి సందడి గా ఉంటుంది.అందరూ బొమ్మలకొలువులు పెడతారు. ఆపదిరోజులూ వీధిలో అందరినీ పేరంటాలకు పిలుస్తా రు.ఎంత సందడిగా ఉంటుందని? కానీ ఈ సంవత్సరం మా ఇంట్లో ఎవ్వరినీ ఎవ్వరూ పేరంటానికి పిలవలేదు.కారణం నాకు తెలియక కాదు. తెలియనట్టు నటించాను. ఆవిషయం మేమెవ్వరం మాట్లాడుకోలే దు. అందరికీ తెలిసిన కారణమే! ఎవ్వరంతెలియనట్లు నటిస్తున్నాము. ఇంట్లో విషాదం అలుము కొంది.అదినా వల్లనే అని తెలుసు.నేనున్నన్ని రోజులూ ఈ విషాదం తప్పదు.మూడు నెలలక్రిందట ఎదురింట్లో వారి కోడలుకు సీమంతం జరిగింది.ఆంటీ వచ్చి మా అమ్మ ను పిలిచింది.వెళ్తూ వెళ్తూ ఆమె చెప్పినమాటలు నాచెవులను దాటి పోలేదు. "బృందను తీసుకు రాకు వదినా!" ఆ function కు అమ్మ వెళ్ళలేదు.
కానీ ఎన్నాళ్ళిలా? అమ్మా,నాన్నలకు నామీద అమితమైన ప్రేమ ఉంది. శివాకు కూడా నేనంటే ప్రాణం. కానీ వీరి ఈ ప్రేమను నేను నాస్వార్ధానికి వినియోగించుకొంటున్నానా?
నావియోగం వీరికి అశనిపాతమే ఔతుంది.కానీ కొద్దిరోజులే.ఆతర్వాత , అంతా నన్ను మరచి పోతారు. ఇప్పుడు నేనేంచెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా మూడు రోజులతర్వాత నాకు దొరికింది.
28, సెప్టెంబర్ 2010, మంగళవారం
నేనెందుకిలా............15
నిశ్చల చెప్పిన విషయం నా మీద తీవ్రంగానే పని చేసింది. పక్క రోజే నాన్నగారి గదికెళ్ళాను.తలవంచుకొని గుమ్మంవద్ద నిల్చున్న నన్ను ఆప్యాయంగా పిలిచారు నాన్న. నా కన్నులలోనీరు తిరిగింది "నాన్నా! "అన్నాను తల వంచుకొనే. నా చుబుకం పట్టుకొని తలపైకెత్తి అన్నాడు నాన్న."అబ్బో! అల్లరి బృందకు నాదగ్గరకూడా మొహమాటమెప్పటినించో?"తలెత్తి నాన్న గా రి వైపు చూ శాను.
"నాన్నా!శివా సెక్సు మార్పిడి చెయ్యొచ్చంటున్నాడు". చెప్పలేక చెప్పాను.నాన్న నన్నొదిలేసి బీరువాదగ్గరకు వెళ్ళాడు.నేను చెప్పింది ఆయన వినలేదేమో అనుకొన్నాను.చేతిలో ఒక ఫైలు తో వచ్చారు నాన్న. ఇలా చెప్పసాగారు "బృందా! నీవిషయం బయట పడ్డప్పటి నుంచీ నేను తిరగని ఆసుపత్రి లేదు.కన్సల్ట్ చేయని డాక్టరు లేడమ్మా! నిజానికి శివా కంటే నీ కోసమే ఎక్కువగా తిరిగాను.నీ విషయంలో మనం దురదృష్టవంతులం బృందా!నీకు ,ఈస్ట్రోజన్,మాస్కులైన్ నిష్పత్తి 50:50 ఉంది.35:65 ఉంటే తేలిగ్గా సెక్సు మార్పిడి చేసుకో వచ్చు.40:60వరకు కూడా ప్రయత్నించవచ్చు. కానీ నీ విషయం లో అది సాధ్యం కాదని చెప్పారమ్మా.ఈ వి షయాలన్నీ నీ కు చెప్తే బాధ పడతావని చెప్పలేదు." నా కన్నులనిండా నీరు గిర్రున తిరిగింది.నేనెంత పాపిష్టి దాన్ని.నాన్నగారిని ఎంత తక్కువగా అంచనా వేశాను.
ఉన్నఫళంగా క్రింద కూలబడి నాన్న గారి కాళ్ళు పట్టుకున్నాను."నన్ను క్షమించండి నాన్నా"అన్నాను ధుఖంతో పూడి పోయిన గొంతుతో.
వంగి నన్ను లేవతీశారు.నన్ను గట్టిగా హత్తుకున్నారు నాన్న. ఆశపడ్డ ఆ ఒక్క అవకాశం కూడా లేదని తెలియటం తో మనసు భారమయ్యింది.
చిన్నగా వెను దిరిగాను.
7, ఆగస్టు 2010, శనివారం
నేనెందుకిలా.......14

పక్క రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మలుపు తిప్పిం దనే చెప్పాలి .ఉదయాన్నే నాగదిలో కూర్చొని ఏదో పుస్తకం తిరగేస్తున్నాను . హథాత్తుగా ఊడి పడింది నిశ్చల.నా ఆనందానికి అవధులే లేవు .ఎన్నిరోజులయ్యింది నిశ్చలను చూసి ?
మామధ్య ఎన్ని మాటలు దోర్లిపోయాయని? నిశ్చలను చూసి నా ధుః ఖాన్ని పూర్తిగా మరచి పోయాను.మనసు నిండా సంతోషమే!మా మాటల్లో పొంగి పొరలుతున్న ఉత్సాహం .ఎంతసేపు గడిచి పోయిందో తెలియనే లేదు, అమ్మ వచ్చి భోజనానికి పిలిచేవరకు.భోజనాలు చేసి నారూము లో కబుర్లు చెప్పుకొంటూ పడుకొన్నామిద్దరం. అప్పుడు చెప్పాను నిశ్చలకు మానాన్న చేసినపని గురించి.'నేను మానాన్నకు ఇంత భారమౌతాననుకోలేదు నిశ్చలా!' అన్నాను కన్నీటితో.నిశ్చల నా కన్నీరు తుడిచింది.
కొంత సేపు మౌనంగా ఉండి పోయింది.'ఏమిటే! మౌనంగా ఉన్నావ్?'మానాన్న చేసిన పనికి ఆశ్చర్య పోతుందని ,ఆయన్ను నాఎదుటే తిట్టి పోస్తుందని ,ఆశించిన నాకు దాని మౌనం అర్ధంగాలేదు.కొంత సేపు తర్వాత నింపాదిగా అంది నిశ్చల .
'మీ నాన్న చేసిన దాన్లో తప్పేం కన్పిచడం లేదు నాకు.బృందా !నెమ్మదిగా ఆలోచించి చూడు.నువ్విప్పుడు సంతోషంగా ఉన్నావా?
బయట నీ ముఖం చూపి ఎన్ని రోజులయ్యింది? ఎన్ని అవమానాలు ? ఎంత మనో వేదన? ఎన్నిరోజులిలా? జీవితం దుర్భర మౌతుంది బృందా! నువ్వు భరించలేవు .మీనాన్న చేసినపనిలో ముందు చూపు ఉంది.నువ్వు ఆవేశంలో అర్ధం చేసుకోవటంలేదు'
ఆశ్చర్యంతో నా కన్నులు పెద్దవయ్యాయి. నిశ్చల కూడా ఇలా చెప్తుందేమిటి ?
ఈ ఇంటిని నావాళ్ళను వదిలి వెళ్లి పోవాలా ?ఎక్కడికి?
అలొచిస్తూనే అన్నాను 'శివా నాకు సెక్షు మార్పిడి చేయిస్తానన్నాడు నిశ్చాలా!'
నిశ్చల నా వైపు చూసి చిన్నగా నవ్వింది. 'నాన్న గారిని నువ్వు తక్కువగా
అంచనా వేసుకొంటున్నావు బృందా! ఈ విషయాలన్నీ కనుక్కోకుండానే ఆ నిర్ణయానికి
వచ్చాడంటావా?' నేనెంత పిచ్చిదాన్ని? నాన్నను గురించి ఎంత తొందర పాటుగా
ఆలోచించాను? ఆవెశంలో ఎంత అపార్దం చేసుకొన్నాను?
.19, మే 2010, బుధవారం
నేనెందుకిలా............13
నన్ను చూసి ఆవ్యక్తి వినయంగా లేచి నిల్చున్నాడు.ఆ శ్చర్యంతో అతని ఎదురుగా కుర్చీలో కూర్చున్నాను.అతను చూడటానికి అందంగానే ఉన్నాడు.
ఇతనికి నాతో పనేమిటి చెప్మా అనుకొం టూ చూస్తూన్న నన్ను చూసి చిన్నగా నవ్వాడు అతను.నాన్న గారు మా ఇద్దరి వైపూ చిరునవ్వుతో చూస్తూ కూర్చుని ఉన్నారు.
నిశ్శబ్ధాన్ని ఛేదిస్తూ మొదలుపెట్టాడతను. "నేను అరవాణి సంఘం రెప్రసెన్టేటివును.చెన్నై నించీ వస్తున్నాను.మీలాంటి వాళ్ళకోసం ఈ సంఘం స్థాపించపడింది.మీలాంటి వారందరూ ఒకచోట చేరి సేవా కర్యక్రమాలు చేస్తూంటారు.మిమ్మల్ను పోషించే భాద్యత సంఘమే తీసుకొంటుంది.మీకు నెల నెలా కొంత జీతం కూడా ఇస్తారు.మీరు సగర్వంగా తలెత్తుకొని బ్రతకటా నికి మా సంఘం సహాయ పడుతుంది.మీలాంటి వారు మూడు వందల మంది ఇప్పటికే ఈ సంఘంలో చేరివున్నారు.మీరు సరే నంటే ఇప్పుడే ఫార్మలిటీస్
పూర్తి చేద్దాం." అంటూ సూటుకేసులోంచీ కొన్ని పేపర్లు బయటకు తీశాడు.నా కాలిక్రింద భూమి కదలసాగింది.నోరు ఎండిపోయింది.నాలుకతో పెదవులు తడుపుకొంటూ అడిగాను " అరవాణి అంటే" అతను నావైపు చూసి చిన్నగా చెప్పాడు "తమిళంలో అరవాణి అంటే ’కొజ్జా’ అని అర్ధం"
నాకడుపులోంచీ దుఃఖం ఎగదన్నుకొస్తూంది ఉప్పెనలా.అంతటి దుఃఖాన్నీ చిరునాలుకతో గొంతులో నొక్కిపట్టి అడిగాను :నన్ను గురించి ఎలా తెలిసింది"
అతను సూటుకేసులోంచీ ఒక ఉత్తరం తీసి చూపిస్తూ చెప్పాడు "మీనాన్నగారే ఈ ఉత్తరం మాకు వ్రాశారు"
నాగొంతు లోంచీ కెవ్వుమన్న కేక వచ్చింది.కన్నీటితో నిండిన కన్నులలోంచీ నాన్న గారివైపు చూశాను.తలదించుకొని కూర్చున్నాడు.
’నేను మీకింత భారమయ్యానా నాన్నా!" అని మాత్రం అనగలిగాను.ఆపై దుఃఖంతో గొంతు పూడుకుపోయింది.రెండు చేతుల మధ్యతలనుంచుకొని పెద్దగా ఏడవసాగాను.
గది గుమ్మం వద్ద నిల్చుని అంతా వింటున్న అమ్మ చెంగున నాదగ్గరకు దూకింది.నా తలను చేతులతో పట్టుకుని పొట్టకాన్చుకుని జుట్టు నిమురుతూ అతనితోఅంది
"మీరు దయచేసి బయటకు వెళ్ళండి" అంది తర్జనితో వాకిలి చూపుతూ.
’మేము కొజ్జాలకు సేవ చేస్తున్నాం.ఇది మీకు చాలా మంచి అవకాశం......’ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు
వెనుక నించీ శివా ఒక్క ఉదుటున అతని దగ్గరకు దుమికాడు.అతని చేతులలోని పేపర్లు లాక్కుని చింపేశాడు.వాడి కళ్ళలోంచీ నీళ్ళు ధారగా కారుతున్నాయి.”మా బృంద మాకు భారంకాదు.దయచేసి వెళ్ళి పొండి ’ అరుస్తూ చెప్పాడువాడు.
అంతటి దుఃఖంలోకూడా ఒక చిన్న ఆనంద వీచిక నన్ను తాకింది.శివా కు నేనంటే ఎంత ప్రేమ.
అతను నాన్న వైపు ఒక చూపు చూసి నిష్క్రమించాడు.
"ఎంతపని చేశారండీ.బృంద లేకుండా మనం బ్రతక గలమా " అంది అమ్మ కన్నీటి తో
శివా నాన్న వైపు కోపంతో చూడసాగాడు. నామట్టుకూ నేను ఎవ్వరినీ ద్వేషించే స్తితిలో లేను.పెన్నిధి లాగా దొరికిన అమ్మ నడుము గట్టీగా పట్టుకొని ఏడవసాగాను.నాన్న ఏదో సణుక్కొంటూ లోనికెళ్ళిపోయాడు.
అప్పుడు శివా అన్నాడు అమ్మతో ’అమ్మా! బృంద ను డాక్టరుకు చూపించి సెక్సు మార్పిడి చెయ్యిస్తే. ఈరోజుల్లో జరగనిదేంఉంది,డబ్బు ఖర్చు పెట్టాలేగాని.’
నేను శివా వైపు ఆశ్చర్యంగా చూడసాగాను.........ఇది జరుగుతుందా????????
పూర్తి నవల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
నా కవితలు
- నీవన్నది,నిజమైనది
- నీ వున్నావని
నా బ్లాగు లిస్ట్
నా గురించి
- jayachandra
- CHENNAI, TAMILNADU, India
- జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!


