16, మే 2010, ఆదివారం

నేనెందుకిలా............ 12

"మా ఫ్రెండ్సందరూ నన్ను గేలి చేస్తున్నారు బృందా !మీచెల్లెలు లాగే నీవుకుడా నేమో! ఒకసారి చూసుకో. అంటు ఒకటే ఎగతాళి చేస్తున్నారే !నాకైతే ఏడు పోస్తుంది..నీకు చెప్పి నిన్ను బాధ పెట్టగూడ దనుకున్నాను.కాని తప్పలేదు బృందా!కాలేజి మానేద్దామను కొంటు న్నానే!" వాడి కళ్ళల్లో చివ్వున నీళ్ళు చిమ్మాయి.నేను గాజు కళ్ళతో వాడికేసి చూడసాగాను.
అంటే,నేనిప్పుడేం చెయ్యాలి? చచ్చి పోవాలా? నేను చేయగలిగింది అది ఒక్కటే గదా.వీడి ఉద్దేశ్యం గూడా అదేనా?
"శివా! నేనేం చేయనురా? చెప్పు.నువ్వేం చెయ్యమంటే అది చేస్తాను.కానీ చచ్చిపోమ్మని మటుకు చెప్పకురా.నాకంతధైర్యం లేదురా.
నాకప్పుడే చచ్చి పోవాలని లేదురా " రెండు చేతులతో తలకొట్టు కొంటూ పెద్దగా ఏ డవ సాగాను .
శివా నా రెండు చేతులు గట్టిగా పట్టుకొని  నా తలను వాడి గుండెల కదుము కున్నాడు.ధుక్కంతో వాడి గుండెలు ఎగిసెగిసి
పడుతున్నాయి.
    **********          ************************  *********
                                       మండు వేసవిలో చిరుజల్లులు కురిసినట్టు మా కుటుంబంలోకూడా ఒక సంతోష సంఘటన జరిగింది.శివా ఆపరేషన్ జయప్రదమయ్యింది.వాడు పూర్తి ఆరొగ్యవంతుడయ్యాడు. మా యింట్లో సంతోషం వెల్లివిరిసింది.చాలా రోజుల తర్వాత  సందడి ,సంతోషం, నవ్వులతో మాయిల్లు కళ కళ లాడింది.వారంరోజులపాటు నన్ను నేను మరచి ఆ వేడుకలలో భాగం పంచుకొన్నాను.అమ్మా నాన్న లను అలా సంతోషంగా చూసి ఎన్ని రోజులయ్యిందని.
                                              ఆరోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు.గేటు చప్పుడైతే కిటీకీలోంచీ బయటకు చూశాను.ఎవరో పాతికేళ్ళలోపు యువకుడు లోనికి వస్తున్నాడు .నేను నాగదిలోదూరి తలుపేసుకొన్నాను.ఈమధ్య  చిన్న అలికిడైనా గుల్లలోకి దూరి ఆత్మ రక్షణ చేసుకొనే నత్త లాగా నేను బయట చిన్న అలికిడైనా నా గదిలోకి దూరిపోతున్నాను.ఇంటికివచ్చేవాళ్ళంతానా వైపు అదోలా చూస్తున్నారు.అసలు నన్ను చూడడానికే కొందరు పని లేక పోయినా వస్తున్నారేమోనని నా అనమానం .కానీ ఆ వచ్చినతను చేతిలో  సూటుకేసుతో  దిగాడు .ఎవరైనా బందువేమో !
నా ఆలోచనలనంతం చేస్తూ కొంచెం సే పు తర్వాత  తలుపు శబ్ద మయ్యింది.                 నాన్న!
'నీకోసం ఎవరొచ్చారో చూడు !'       నాకోసమా? ఈ భూప్రపంచంలో నాకో గుర్తింపు ఉందా? నన్ను చూడడానికి ఎవరైనా వస్తారా?
ఎవరునాన్నా?      'వచ్చి చూడు '    సంభ్రమంగా నాన్న నను సరిం చాను .................

2 కామెంట్‌లు:

  1. అద్భుతంగా రాస్తున్నారు అని చెప్పడం చాలా చిన్నపదమేమో జయచంద్ర గారు..నేను ఇన్ని రోజులు ఈ నవల ఎలా మిస్సయ్యానో..ఇది జరిగిన సంఘటన?? లేక కల్పితమా?..ఏదేమైనా కళ్ళకు కట్టినట్లు రాస్తున్నారు..అక్కడ పత్రాల భావావేశాలు నేను కూడా అనుభావిన్చెంత గొప్పగా...తదుపరి భాగం కోసం ఎదురు చూస్తూ ఉంటాను :)

    రిప్లయితొలగించండి
  2. చాలా ఆసక్తిగా సాగుతూవుంది మీ కథనం, ప్రతిరోజు ఎప్పుడెప్పుడు పోస్టు చేస్తారాని ఎదురుచూస్తూవుంటాను. ఈ నవలకు మొదటిభాగం లంకెను ఇవ్వగలరా..మీ బ్లాగులో కనపడటంలేదు.

    రిప్లయితొలగించండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!