20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

స్వా గతం

నీ చిరు నవ్వుల మల్లెలను
వాకిలిలో పరిచి ,ముంగిలిలో
నీ రుధిరము తో ముగ్గులు వేసి
నడిచే దారులలో
గులాబి రేకులు పరచి
నాకు నీవిచ్చిన స్వాగతం
మరపు రానిది,మదురమైనది!!

ధవళ వస్త్రధారిణి వై
నీ ఆశ్రమ వాకిలిలో నిలిచి
చేతులను జోడించి
పెదవులు కదిలించి
నీవు చెప్పిన 'స్వాగతం'
మరపు రానిది,మధురమైనది!!

వెన్నెల వెలుగులలో తడిసి
లోనికి అడుగిడిన నాకు
నీ చూపుల వెలుగులను
నాకోసం వెచ్చించి
లోకమంతా చీకటి చేసి
నీవు నాకిచ్చిన స్వాగతం
మరపు రానిది,మధుర మైనది!!

అర్ఘ్య పాద్యాన్ని నాకంధించి
అలవోకగా నా వైపు చూస్తూ
నీవు వెదజల్లిన చిరు నవ్వుల జల్లులు
మరపు రానివి,మధురమైనవి!!

అర్క పక్వ ఫలాలను ఒక టొకటిగా
నీ చూపులతో కడిగి,చే తులతో విరిచి
నా కంది స్తున్న ప్పుడు ,
నీ కన్నులలో మెదలిన భక్తి భావం
మరపు రానిది,మధురమైనది!!

ఒంగి నా పాదాలను తాకి
ముకుళిత హస్తా లతో ఒదిగి నిల్చుని,
గురు భక్తిని కన్నులలో కురిపిస్తూ,
ఆశ్రమ ప్రాంగణం దాటే వరకు
నా వెనుకే వచ్చి ,నీ విచ్చిన వీడుకోలు ,
మరపు రానిది,మధురమైనది!!!!!


8, ఫిబ్రవరి 2009, ఆదివారం

మనసు

నిలకడ లేనిధి ఈ మనసు
నిదురే పోదేరోజు !

వినీలాకాసం క్రింద
పరుగెత్తే మేఘాలను
పట్టుకోవాలంటుంది
పైకెగయాలంటుంది
నిలకడ లేనిది ఈ మనసు
నిదురేపోదేరోజు !

చల్లని చంద్రికలో
నక్షత్రాల ముగ్గుల్లో
నడిచి వెళ్ళే చంద్రుణ్ణి
చుడాలంటుంది
చూస్తూనే వుండా లంటుంది
నిలికడ లేనిదీ మనసు
నిదురే పోదే రొజు !

చల్లని వెన్నెలను
రంగుల పూవులను
ప్రకృతి చేసే విందు లంటుంది
కను దోయిని శాసిస్తుంది చూడమని
చూసి చూసి పరవసించమని
నిలకడ లేనిదీ మనసు
నిదురే పోదేరోజు !

వెన్నెల లో తడిసిన మందారపు టందాలు
మంచు కురిసిన ముత్యాల చినుకులు
కదలి వెళ్ళే రమణి సోయగపు నడకలు
మత్తెక్కించే ఆమె పరువాల పొంగులు
అన్నీ చూడా లంటుంది
అవే కావాలంటుంది
నిలకడ లేని ధీ మనసు
నిదురే పోదేరోజు !

విరబూసిన సన్నజాజి చెట్టు క్రింద
పరచిన పట్టు పరుపు ప్రక్క మీద
కురిసే చల్లని వెన్నెల నీడ లోన
నిమిష మైనా నిలువ నంటుంది
ఎటో ఎటో పోవాలంటుంది
నిలకడ లేనిధీ మనసు
నిదురే పోదేరోజు !

తెల్లని వెన్నెలలో
చల్లని మంచు కొండపైన
విహరించే రాజ హంసను
వొడిసి పట్టాలంటుంది
పట్టి చూదాలంటుంది
గగన మనే క్షేత్రంలో
వెదజల్లిన నక్షత్రాల విత్తులను
తిరిగి ఏరాలంటుంది
ఏరితీరా లంటుంది
నిలకడ లేనిదీ మనసు
నిదురే పోదేరోజు !

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!