20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

స్వా గతం

నీ చిరు నవ్వుల మల్లెలను
వాకిలిలో పరిచి ,ముంగిలిలో
నీ రుధిరము తో ముగ్గులు వేసి
నడిచే దారులలో
గులాబి రేకులు పరచి
నాకు నీవిచ్చిన స్వాగతం
మరపు రానిది,మదురమైనది!!

ధవళ వస్త్రధారిణి వై
నీ ఆశ్రమ వాకిలిలో నిలిచి
చేతులను జోడించి
పెదవులు కదిలించి
నీవు చెప్పిన 'స్వాగతం'
మరపు రానిది,మధురమైనది!!

వెన్నెల వెలుగులలో తడిసి
లోనికి అడుగిడిన నాకు
నీ చూపుల వెలుగులను
నాకోసం వెచ్చించి
లోకమంతా చీకటి చేసి
నీవు నాకిచ్చిన స్వాగతం
మరపు రానిది,మధుర మైనది!!

అర్ఘ్య పాద్యాన్ని నాకంధించి
అలవోకగా నా వైపు చూస్తూ
నీవు వెదజల్లిన చిరు నవ్వుల జల్లులు
మరపు రానివి,మధురమైనవి!!

అర్క పక్వ ఫలాలను ఒక టొకటిగా
నీ చూపులతో కడిగి,చే తులతో విరిచి
నా కంది స్తున్న ప్పుడు ,
నీ కన్నులలో మెదలిన భక్తి భావం
మరపు రానిది,మధురమైనది!!

ఒంగి నా పాదాలను తాకి
ముకుళిత హస్తా లతో ఒదిగి నిల్చుని,
గురు భక్తిని కన్నులలో కురిపిస్తూ,
ఆశ్రమ ప్రాంగణం దాటే వరకు
నా వెనుకే వచ్చి ,నీ విచ్చిన వీడుకోలు ,
మరపు రానిది,మధురమైనది!!!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!