17, జులై 2009, శుక్రవారం

మాటాడు కొందాం రా !




మనదేశ ప్రధానీ,పాకిస్తాను ప్రధానీ అప్పుడప్పుడూ మాటాడు కొంటూంటారు.ఈమాటలపేరు చర్చలు.అన్ని పత్రికలూ హెడ్ లైన్స్ ఇదే వార్త.
పత్రికలకు రెండు రోజులు న్యూసుకు ఢోకా లేదు.ప్రజలందరి ఉత్కంఠను జాగ్రుతం చేస్తాయి. తంతు ఈరోజుది కాదు.ఇప్పటికి ముప్పై ఏళ్లనుంచీ జరుగుతున్నదే.వెనక్కు తిరిగి చూసుకొంటే మాటల(చర్చల)వల్ల ఒరిగిందేమీ కన్పించదు.బహుశా వారిద్దరూ ఇలా మటాడు కొంటారేమో!
.ప్ర(మనప్రధాని) పా.ప్ర(పాకిస్తాన్ ప్రధాని)

.ప్ర. హల్లో!బాగున్నరా?
పా.ప్ర బాగున్నానండీ.మీరెలాగున్నారు.మీదేశమెలాగుంది?
.ప్ర. అంతా బాగుందండీ.ఏమిటీ?మీగొంతు కొంచం భారంగా ఉందీ.ఆరోగ్యం బాగాలేదా?
పా.ప్ర. కొంచెం జలుబు చేసిందండీ.ఇంకేం లేదు.చెప్పండి .ఏమిటి విశేషాలు?
.ప్ర . ఏంలేదు .చాలారోజులైందికదా,పలకరించివెళ్దామని.
పా.ప్ర. నాక్కూడా ఎవరైనా వచ్చి మాటాడితే బాగుండు ననిపిస్తూండింది.తెగ బోరుగా ఉందనుకోండి.
.ప్ర .నాక్కూడా విసుగ్గా ఉందం డీ.దీనికి తోడు మాదేశంలో ఈమద్య టెర్రరిజం ఎక్కువయ్యింది.
పా.ప్ర. ఆగొడవలన్నీ ఇక్కడ కూడా తేకు బాబూ.అసలే తలనొప్పిగా ఉంది.
.ప్ర. నాకు మటుకూ తేవాలని సరదానా? అటుచూడండి.......(మూలనున్న టీవీ వైపు చూపాడు.అది భారతదేశపు చానల్ లో న్యూసు
"ఇండియా కూ పాకిస్తానుకు మద్య ముమ్మరంగా చర్చలు సాగుతున్నాయి.కాష్మీరు, ఉగ్రవాదం ఈచర్చల్లో ముఖ్యంగా చోటు చేసు కొంటాయని
భావిస్తున్నారు" )
పా.ప్ర .అదిసరే, ఇంతకీ మీ పాప ఏంచేస్తూంది?చదువు పూర్తి చేసిందా?
.ప్ర. మొన్ననె పూర్తయ్యింది.తను కూడా రాజకీయాల్లోకి రావాలనుంది.
పా.ప్ర. ఇంకేం.కాబోయేప్రధాని అన్నమాట.మావాడికే చదువబ్బలేదు.మొన్ననే టెర్రరిస్టు ట్రైనింగు పూ ర్తి చేసుకొని బయటకు వచ్చాడు.ఏదేశానికి పంపాలా అని ఆలోచిస్తున్నాను.టెర్రరిస్టులు పట్టుబడ్దా క్షేమంగా ఉండగలిగే దేశం ఏదా అని చూస్తున్నాను.(.ప్ర.వైపు అదోలా చూస్తూ)
.ప్ర. ఈసారి వర్షాలే లేవు గదా? ఇంతకు ముందెప్పుడూఇలా లేదు.
పా.ప్ర. ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి.అన్నట్టు కంబక్త్ ఇష్క్ సినిమా చూశారా!చాలాబాగుందికదా?
.ప్ర . అవును.మాపాప చెప్పింది.కరీనా చాలా లవ్లీ గాఉందట గదా.చూడాలి.
పా.ప్ర .మీకోసం హై టీ అరేంజి చేశాను. లేద్దామా?
.ప్ర. ఓకే. ఓకే
రెందు దేశాల్లో జనాలు టీవీ లముందు గుమిగూడి ఆదుర్దాగా చూస్తున్నారు."ఇద్దరు ప్రధానులూ టీ కోసం చర్చలు కొంతసేపు నిలిపివేశారు.టీ తర్వాత చర్చలు మళ్ళీకొనసాగుతాయి"...న్యూస్ .......టీ తర్వాత
.ప్ర. టీ బాగుందండీ.ఏమి పొడి?
పా.ప్ర . మాకోసం ప్రత్యేకంగా చేయిస్తాము.మీరు వెళ్ళేప్పుడు ఒక ప్యాకెట్ తీసికెళ్ళండి.
.ప్ర .వద్దులెండి.ఎవరైనా చూస్తేబాగోదు.బయట ప్రెస్సు వాళ్ళు ప్రాణాలు తీ స్తారు.ఏంచెబుదాం?
పా.ప్ర . చర్చలు ఒక కొలిక్కి రాలేదనీ,మళ్ళీ కలుసుకొంటామనీ చెబ్దాం.
.ప్ర. భలే బాగుందే. అలాగే.......
ఇద్దరూ లేచారు. బయటకు రాబోతూ ఆగాడు పా.ప్ర
పా.ప్ర. అన్నట్టు..మాదేశం వాడు పేరేందీ .. కసబ్ అనుకొంటా మీరు జైల్లో పెట్టారట గదా.అతన్ని విడిపిస్తే బాగుంటుంది
మీరు బాగా చూసుకోరని కాదూ! అయినా ఇక్కడకు పంపితే బాగుంటుంది.
.ప్ర. అలాగే!అదేం భాగ్యం. ఇద్దరూనిష్క్రమించారు.

త్వరలో మళ్ళీ చర్చలు. రెండు దేశాల మధ్య సమశ్యలు పరిష్కారం అయ్యే సూచనలు......పత్రికల్లో హెడ్ లైన్స్

5 కామెంట్‌లు:

  1. బాగా చెప్పారు.Too good :)
    "మావాడికే చదువబ్బలేదు.మొన్ననే టెర్రరిస్టు ట్రైనింగు పూ ర్తి చేసుకొని బయటకు వచ్చాడు.ఏదేశానికి పంపాలా అని ఆలోచిస్తున్నాను.టెర్రరిస్టులు పట్టుబడ్దా క్షేమంగా ఉండగలిగే దేశం ఏదా అని చూస్తున్నాను.(మ.ప్ర.వైపు అదోలా చూస్తూ)"
    :))))

    రిప్లయితొలగించండి
  2. భలే ! వీళ్ళిద్దరి మధ్య చర్చలని ఎప్పుడు వార్తలు వచ్చినా నాక్కూడా ఇలాగే ఆలోచనలు వస్తుంటాయి.బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  3. అంతకన్నా వాళ్ళేంచేస్త్తారు. మనం ఎన్నుకున్న నేతలందరు కురువృద్దులే కదా!

    రిప్లయితొలగించండి
  4. మీరు రాసింది సరికాదు. ఇద్దరు దేశాది నేతలు పట్ల ఇలాంటి వాక్యాలు మంచిది కాదు . అందునా పాకిస్తాన్ భారత దేశం గురించి. మీరు రాసింది మరింత ఘాటుగా రాసివుంటే చాలా బావుండేది . అది సంగతి. ప్రజల జీవీతాలను పణంగా పెట్టి కేవలం కరెంటు కోసమంటూ అమెరికా ఎదుట సాగిలపడే వీరు , దేశ శ్రేయస్షు గురించి మాట్లాదేదేముంటుంది.

    రిప్లయితొలగించండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!