5, ఫిబ్రవరి 2011, శనివారం

నేనెందుకిలా............16


వేగంగా గాలిలో తేలిపోతున్న నాకు ఏమీ కన్పించటంలేదు.చెవులు లేవు గనుక విన్పించటం కూడా మానేసింది.సర్వాంగాలూ కుంచించుకుని ఒకబిందువులో ఇమిడి పోయిన అనుభూతి. ఇప్పుడు నా ఆకారం ఎలా ఉంటుంది?.బ్రతుకంతా నన్ను ఏడిపించుకు తిన్న ఆ శరీరం లేకుండా నే నెలా గున్నాను.కేవలం ఒక బిందువుగా మారిపోయిన నేను ఇప్పుడు పురుషుడినా, స్త్రీ నా?.
నేను పరమాణువులా మారిపోయానా?ఈనిశ్శబ్ధ నిశీధిలో నేనెక్కడికి వెళ్తున్నాను?మరణంతర్వాత మరోజన్మను వెతుక్కుంటూ వెళ్తున్నానా?
ఇంత జరిగినా నాలో ఆలోచనలు అణగారి పోలేదు. ఆలోచిస్తున్నది ఈ మనసేనా? మనసంటే ఆత్మేనా? ఆహా! మరణం తర్వాతి ఈ రహశ్యం
ఎంత బాగుంది? ఇదంతా నేను ఎవరికైనా చెప్పగలిగితే ఎంత బాగుంటుంది.కనీసం నిశ్చలకైనా!కానీ నేను చూడలేను.చెప్పలేను.ఎంత దౌర్భాగ్యం?
ఈ సృష్టి రహశ్యం తెలుసుకున్నా ఎవ్వరి కీ చెప్పలేని దురదృష్టవంతురాలిని.మన ఋషులూ,యోగసాధకులూ,చెప్పినది కొంతవరకూ నిజమేనని,ఈ ఆలోచించే మనసు ఎల్లవేళలా మనతోనే ఉంటుందనీ,ఎవరికైనా చెప్తేబాగుణ్ణు.కానీ ఎలా?
వేగంగా వెళ్తున్న నేను ఆగిపోయిన అనుభూతి.కళ్ళు చించుకొని చూడటానికి ప్రయత్నించాను.కళ్ళు లేవు. కానీఇదోపిచ్చిప్రయత్నం.అన్నీఉన్నట్టేఅనుభూతి.శరీరంలేని మనసు ఎంత దుర్భరంగా ఉంది?శరీరం ఉన్నప్పుడు దాన్ని ఎంత తిట్టుకొనేదాన్ని!నాజన్మను తలచుకొని విలపించని రోజుందా? కానీ అప్పుడెంత తప్పు చేశానో ఇప్పుడు తెలుస్తూంది
మళ్ళీ కదలిక మొదలైంది.ఈసారి చాలానెమ్మదిగా.కదలికలోవేగం తగ్గింది.ఆలోచనల్లో కూడా! అన్ని అవయవాల్లాగే మనసు కూడా క్రమంగాపని చేయడం మానేస్తుందేమో.ఙాపకాలు నన్ను విడిచి వెళ్ళిపోతాయేమో. అప్పుడు మనసు కూడా శూన్యమౌతుందేమో?  నాకు చలి, వేడి, ఏమీ తెలీటం లేదు.నేను జీవించి ఉండగానే కాదు. మరణించాక కూడా దురదృష్ట వంతురాలినే.నేను చనిపోయి
ఎన్ని రోజులయ్యింది? నెలలా , సంవత్సరాలా?   ఇప్పుడు అమ్మా నాన్నలు ఏం చేస్తుంటారు? నిశ్చల ఎలా ఉంటుంది?  ఆరోజు........నాజీవితాన్ని మలుపు తిప్పిన రోజు, నన్ను గమ్యంవైపు నడిపిన రోజు,
ఆ గమ్యం మంచిదా చెడ్డదా అని తెలియకుండానే అటువైపు అడుగులేసిన రోజు, నా జీవితకాలంలో ఎంత ముఖ్యమైన రోజది?
************************************       *****************************                              ***************************************              *****************************************

                 నాన్న వద్ద నుంచీ నాగదిలోకి చేరిన నేను ఒక శిల్పంలా మారి పొయ్యాను.మనసు మొద్దుబారిపోయింది.కళ్ళు తెరుచుకొని ఉన్నానేగానీ దేనినీ చూడటం లేదు.నాన్న చెప్పిన మాటలు
చెవుల్లోమారుమ్రోగుతున్నాయి." నీ విషయంలో అదిసాధ్యంకాదమ్మా" ఇకనేను బ్రతకటమెందుకు? ఇప్పుడు నేనొక branded కొజ్జాను .నావల్ల ఎవరికీ సుఖంలేదు. మనశ్శాంతి లేదు. పైగా నావిషయంగాఇంట్లో అందరూ ఎన్నోఅవమానాలను ఎదుర్కొంటున్నారు.ఈ విషయం నాకు తెలిసీ తెలియనట్లుగా నటిస్తున్నాను. దసరా పండుగలొస్తే మా వీధంతా సందడి సందడి గా ఉంటుంది.అందరూ బొమ్మలకొలువులు పెడతారు.  ఆపదిరోజులూ వీధిలో అందరినీ పేరంటాలకు పిలుస్తా రు.ఎంత సందడిగా ఉంటుందని? కానీ  ఈ సంవత్సరం మా ఇంట్లో ఎవ్వరినీ ఎవ్వరూ పేరంటానికి పిలవలేదు.కారణం నాకు తెలియక కాదు. తెలియనట్టు నటించాను. ఆవిషయం మేమెవ్వరం మాట్లాడుకోలే దు. అందరికీ తెలిసిన కారణమే! ఎవ్వరంతెలియనట్లు నటిస్తున్నాము. ఇంట్లో విషాదం అలుము కొంది.అదినా వల్లనే అని తెలుసు.నేనున్నన్ని రోజులూ ఈ విషాదం తప్పదు.మూడు నెలలక్రిందట ఎదురింట్లో వారి కోడలుకు సీమంతం జరిగింది.ఆంటీ వచ్చి మా అమ్మ ను పిలిచింది.వెళ్తూ వెళ్తూ ఆమె చెప్పినమాటలు నాచెవులను దాటి పోలేదు.  "బృందను తీసుకు రాకు వదినా!"     ఆ function కు అమ్మ వెళ్ళలేదు.
కానీ ఎన్నాళ్ళిలా? అమ్మా,నాన్నలకు నామీద అమితమైన ప్రేమ ఉంది. శివాకు కూడా నేనంటే ప్రాణం. కానీ వీరి ఈ ప్రేమను నేను నాస్వార్ధానికి వినియోగించుకొంటున్నానా?
నావియోగం వీరికి అశనిపాతమే ఔతుంది.కానీ కొద్దిరోజులే.ఆతర్వాత , అంతా నన్ను మరచి పోతారు. ఇప్పుడు నేనేంచెయ్యాలి? ఈ ప్రశ్నకు సమాధానం సరిగ్గా మూడు రోజులతర్వాత నాకు దొరికింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!