27, జులై 2019, శనివారం

ఎర్ర బంతి ఎలక్షన్లు

 

                      ఎలక్షన్ రిసల్ట్ వఛ్చిన రోజు నాకు నిద్ర పట్టలేదు .ప్రజాస్వామ్య భారతం లో ఒక మహాద్భుతం జరిగింది. ఇప్పటి వరకు జరగనిది . మన రాజకీయ పార్టీలు తమకెన్ని సీట్లు రాబోతున్నాయో ముందుగానే చెప్పేసాయి. అదిగాదు  అద్భుతం. ఏ పార్టీ అయినా తమకు ఎక్కువ సీట్లు వస్తాయనే చెబుతుంది. ఇది ఎప్పుడూ జరిగేదే. కానీ ఖచ్చి తంగా  వారుచెప్పినన్ని సీట్లే రావటం  అద్భుతం. ప్రజాస్వామ్యం లో ఇది సాధ్యమా? ఆలోచనలతో నిద్ర పట్టలేదు . 
ఏమిజరిగింది? ఎక్కడో ఏదో  అపశృతి విన్పిస్తూఉంది.  ఎక్కడ? ఎలా? అంతా మిస్టరీ గా అన్పించింది. ఆ ఆలోచనల మధ్య ఎప్పుడో  తొలి కోడి కూస్తున్నప్పుడు  ఒక జ్యోతి వెలిగింది. నేను స్కూలులో చదువుతున్నప్పుడు  జరిగిన  సంఘటన  నా మదిలో మెదిలింది. 

                           నా స్కూలు డేస్ లో  ఒక మెజీషియన్ మా స్కూలుకు వచ్చ్చాడు.  స్కూలులో అతనిచ్చ్చిన  ప్రదర్శన లో  ఒక గ్రీన్ కలర్  బాక్స్ ను టేబుల్ మీద ఉంచాడు. పక్కనే రంగు రంగుల బంతులున్నాయి ,ఎరుపు రంగు బంతి తప్ప. అతనిలా చెప్పాడు.  " మీలో  ఒకరు వచ్చి  ఇక్కడుండే బంతుల్లో ఒకటి  బాక్సు లో  వేయండి.  మీరు ఏ బంతి  వేసినా  , నేను ఎర్రబంతిని  బయటకు తీస్తాను. మీ ముందే ఇది జరుగుతుంది.  "  బంతి ని బాక్సు లో వేసే అవకాశం నాకే వచ్చ్చింది .నేనే వెళ్లి  తెల్లబంతిని  బాక్సు లో వేశాను. అతను ఏవో మంత్రాలు చదివాడు.  మ్యాజిక్ గుడ్డ ను బాక్సు మీద వేసి  తీశాడు  . కొంత సేపు తర్వాత ఆ గ్రీన్ కలరు బాక్సును  పైకెత్త్తి  ఆకాశానికి చూపించి  క్రింద పెట్టాడు.  ఆ బాక్సును బోర్లించాడు.  ఆశ్ఛర్య కరంగా  దాని లొంచి  ఎర్రబంతి  క్రింద పడింది. చప్పట్లతో  హాలు మారు మ్రోగింది.  అందరికి ఒకటే ఆశ్ఛర్యం. తెల్ల బంతి  ఎర్రగా ఎలా మారింది? ??

                                ఆ రోజు రాత్రి కూడా  నాకు  నిద్ర పట్టలేదు.  ఎంత మ్యాజిక్  అయినా  లాజిక్ కు అందాలి గదా?   రెండో రోజు  స్కూల్లో ఆ మెజీషియన్  దగ్గరికెళ్లి అడిగాను, ఎలాజరిగిందో చెప్పమని.  ఒక పట్టాన  చెప్పలేదు.  చివరికి నా ఉత్సుకత  చూసి  ముచ్చ్చటేసి  అసలు విషయం చెప్పాడు.  అది  విని ఆశ్చర్య పోవటం  నావంతయ్యింది. 

                                 మంత్రాలు చదివే  గందర  గోళంలో   అతను  బాక్సు ను మార్చేశాడు.  నేను తెల్ల  బంతి వేసిన బాక్సు వేరు.  అతను ఎర్ర బంతి తీసిన  బాక్సు వేరు.  రెండు బాక్సు లు  ఒకేలా  ఉన్నాయి.  అతను ముందే చెప్పిన ఎర్రరంగు బంతి వేరే బాక్సు లో రెడీ గా  ఉంది.  ఈ బాక్సు ను దాచేసి  ఆబాక్సు ను  బోర్లించాడు.  అలా అతను ముందే చెప్పిన రంగు బంతిని బాక్సు లో నుంచి తీయ గలిగాడు.      

                                                      ఇప్పుడు నాకు అంతా అర్ధమయ్యింది.  మబ్బులు విడి పొయ్యాయి. నాకు నిద్రపట్టింది.  


                                                     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!