ఆకాశంలో నీవున్నావని
నెలవంకను దివిటీగా చేసుకుని
మబ్బుల మాటున,చుక్కల చాటున
రే యంతా వెదికాను !
నన్ను చూసి నవ్వుతూ
పైకి వస్తున్న సుర్యుడిని
పిచ్చివాడిలా ప్రశ్నించాను
నా చెలి యెక్కడని?
వెల వెల బోయిన నెలవంకను
పడమటి దిక్కుకు విసిరెసి
వడి వడి గా నడచి వచ్చాను
భూమ్మీద నీవున్నావని!
నిశీధిలో నీవున్నావని
నిశ్శబ్దంగా వెదికాను!
వెన్నెల వెలుగులలో కల్సి పోయావని
వెంపర్లాదుతూ వెదికాను!
కడలి అంచున నిల్చున్నావని
కాగడాలతో వెదికాను!
కొండ అంచున కూర్చున్నావని
గుండెను పల్లకీ చేసి పంపాను!
వికసించే పువ్వులలో ,వర్షించే మెఘాల్లో
మంచు కొండల్లో ,మనసున్న గుండెల్లో
ఎక్కడెక్కడో వెదికాను,నీవున్నావని!
నా కన్నీటిని కడవలతో మోసుకొని
నా గుండెల మంటలను బాటలుగా చేసుకుని
నా ప్రాణాలను పిడికిలితో పట్టుకుని
ఎక్కడకు వెళ్ళావు చెలీ!
నేనెక్కడని వెదకను సఖీ!!!!
జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
4, మార్చి 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా కవితలు
- నీవన్నది,నిజమైనది
- నీ వున్నావని
నా బ్లాగు లిస్ట్
బ్లాగు ఆర్కైవ్
నా గురించి
- jayachandra
- CHENNAI, TAMILNADU, India
- జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!
మీ కవితలన్నీ బావున్నాయి .అభినందనలు .మీ బ్లాగ్ పేరు తెలుగులో ఉంటే బావుండేది .
రిప్లయితొలగించండిచాలా సంతోషం. బ్లాగ్ పేరు మార్చటానికి ప్రయత్నిస్తాను
రిప్లయితొలగించండిఎక్కడున్నావు ?
రిప్లయితొలగించండిhttp://pradeepblog.miriyala.in/2009/01/blog-post_28.html
మనసుతో వెతికితే మనతోనే మన చెలి
కళ్ళతో వెతికితే కనిపించేనా హృదయాకాశంలో విహరిస్తున్న నీ చెలి
మీ కవిత బాగుంది.
రిప్లయితొలగించండికాని,
"నా కన్నీటిని కడవలతో మోసుకొని
నా గుండెల మంటలను బాటలుగా చేసుకుని"
సరిగ్గా ఇక్కడ నాకు అర్ధము కాలేదు.
మీ చెలియ మీచెంతనున్నప్పుడు మీకంతా అనందమే కాదా!
మరి ఆమే మీ కన్న్నీటిని కడవలతో మోసుకొని వెళ్ళడమేమిటి?
గుండెల మంటలను బాటలుగా చేసుకుని వెళ్ళడమేమిటి?