
చెలీ,
నీ చిరునవ్వులు చూసేవరకూ తెలియనే లేదు
వెన్నెలలొ సిరిమల్లెలు వికసిస్తాయని!
నీకన్నుల కదలికను చూసేవరకూ తెలియనేలేదు,
గండు తుమ్మెదలు ఊయలలూగుతాయని!
నీ పెదవుల అరుణిమను గాంచేవరకూ ఎరుకేలేదు ,
కుంకుమ పూరేకులు వెన్నెలను బంధించగలవని!
నీనెన్నడుము ఒంపులను చూసేవరకూ సమఝే లేదు,
గోదవరికి కూడా మెలికలుంటాయని!
నిన్ను చూసేవరకూ నాకు తెలియనేలేదు,
నా బొందెలో ప్రాణముందని,
అందులోఒక గుండె కొట్టుకొంటూందని!.
ఆమె ఉనికిని తెలిపారు, అడ్రసు తెలుపలేదు:)..:)
రిప్లయితొలగించండిఆమె ఉనికి నా మనసు,
రిప్లయితొలగించండిఆ సంగతి మీకూ తెలుసు!
ఆగుండెకి లయ నీ తలపేననీనూ..
రిప్లయితొలగించండిమీ ముగింపు చాలా బాగుంది. నెనర్లు.
రిప్లయితొలగించండి