చెలీ ,నీవన్నది నిజమైనది !
గుండెల నిండా ప్రేమను నింపుకొని
నిండుగా కల్సి వుండే నెచ్చెలులు
కాల గర్భంలో కలిసిపోతారని
జ్ఞాపకాల పొరలలో మిగిలి పోతారని
ఆనాడు నీవన్నది
ఈనాడు నిజమైనది!
చెలీ ,నీవన్నది నిజమైనది!
రక్త సంబంధాలు,మైత్రీబంధాలు
వ్యర్ధ పదాలని ,విలువ లేనివని
అర్ధ న్యాయానికి అవి కట్టు బడేవని
ఏనాడో నీవన్నది
చెలీ! ఈనాడు నిజమైనది !
అన్నదమ్ములు,తండ్రీకొడుకులు
అక్కా చెల్లెళ్ళు ,తల్లీకూతుళ్ళు
విడ దీయలేని బంధాలని
విలువకట్టలేని సంబంధాలని
ఆవేశంతో అంచనాలు వేస్తున్న నన్ను
చిరునవ్వుతో వారించి ,
కాటుక కన్నులను కదిలించి,
నా చెంపలపై నిమిరి,
జుట్టుపై తడిమి,
నింపాదిగా నీవన్నది
చెలీ,ఈనాడు నిజమైనది !
వ్రుదాప్యంలో ,వ్యక్తి సంబంధాలను
మనుమలు,మనుమరాళ్ళకు
మంచిగా బోధిస్తున్న నన్నుచూసి
కోపంతో విసుక్కోంటూ
ఆవేశంతో ఊగిపోతూ
కన్నకొడుకు కాలుతో తన్నినప్పుడు
పగిలిన అద్దాల పెంకులతో బాటు
విరిగిన హృదయపు శిధిలాలను
కన్నీటితో వొంగి ఏరుకొంటున్న
నావైపు ఎగతాళిగా చూడకు చెలీ
నిజమే! ఆనాడు నీవన్నది
ఈనాడు నిజమైనది!
సాయం సంధ్యా వెలుగులలో
నీ జ్ఞాపకాల పలుకులను, పిచ్చివాడిలా
తోటలో తిరిగి ఏరుకొంటున్న నాకు
జ్ఞప్తికోస్తున్నాయి నీవాడిన పలుకులు
నా జీవిత సంధ్యా కాలంలో
నేను వొంటరి నౌతానని
తోడు ఎవ్వరూ వుండరని ,నీవన్నది,
చెలీ,ఈనాడు నిజమైనది!
మరణ శయ్యపై నీవున్నప్పుడు
మృత్యువు కౌగిలిలో వొదిగి పోతూ
నా చెవిలో చెప్పిన వేద మంత్రం
ఈ మనుగడలన్ని అశాశ్వత మని
ముందూ వెనుకలు తప్పవని
నీవన్నది నిజమే చెలీ!
ఈనాడు మరణ శయ్యపై
మృత్యువు నాకై పొంచియుండగా
చూపు పోయిన నాకు ధిక్సూచివినీవై
నాప్రక్కన ఎవరున్నారో చెప్పాలని
తహతహ లాడే నీ హృదయ ఘోషను
వినడానికి ,ఇదిగో వస్తున్నా
చెలీ,నీవెనుకేవస్తున్నా ............!!
గుండెల నిండా ప్రేమను నింపుకొని
నిండుగా కల్సి వుండే నెచ్చెలులు
కాల గర్భంలో కలిసిపోతారని
జ్ఞాపకాల పొరలలో మిగిలి పోతారని
ఆనాడు నీవన్నది
ఈనాడు నిజమైనది!
చెలీ ,నీవన్నది నిజమైనది!
రక్త సంబంధాలు,మైత్రీబంధాలు
వ్యర్ధ పదాలని ,విలువ లేనివని
అర్ధ న్యాయానికి అవి కట్టు బడేవని
ఏనాడో నీవన్నది
చెలీ! ఈనాడు నిజమైనది !
అన్నదమ్ములు,తండ్రీకొడుకులు
అక్కా చెల్లెళ్ళు ,తల్లీకూతుళ్ళు
విడ దీయలేని బంధాలని
విలువకట్టలేని సంబంధాలని
ఆవేశంతో అంచనాలు వేస్తున్న నన్ను
చిరునవ్వుతో వారించి ,
కాటుక కన్నులను కదిలించి,
నా చెంపలపై నిమిరి,
జుట్టుపై తడిమి,
నింపాదిగా నీవన్నది
చెలీ,ఈనాడు నిజమైనది !
వ్రుదాప్యంలో ,వ్యక్తి సంబంధాలను
మనుమలు,మనుమరాళ్ళకు
మంచిగా బోధిస్తున్న నన్నుచూసి
కోపంతో విసుక్కోంటూ
ఆవేశంతో ఊగిపోతూ
కన్నకొడుకు కాలుతో తన్నినప్పుడు
పగిలిన అద్దాల పెంకులతో బాటు
విరిగిన హృదయపు శిధిలాలను
కన్నీటితో వొంగి ఏరుకొంటున్న
నావైపు ఎగతాళిగా చూడకు చెలీ
నిజమే! ఆనాడు నీవన్నది
ఈనాడు నిజమైనది!
సాయం సంధ్యా వెలుగులలో
నీ జ్ఞాపకాల పలుకులను, పిచ్చివాడిలా
తోటలో తిరిగి ఏరుకొంటున్న నాకు
జ్ఞప్తికోస్తున్నాయి నీవాడిన పలుకులు
నా జీవిత సంధ్యా కాలంలో
నేను వొంటరి నౌతానని
తోడు ఎవ్వరూ వుండరని ,నీవన్నది,
చెలీ,ఈనాడు నిజమైనది!
మరణ శయ్యపై నీవున్నప్పుడు
మృత్యువు కౌగిలిలో వొదిగి పోతూ
నా చెవిలో చెప్పిన వేద మంత్రం
ఈ మనుగడలన్ని అశాశ్వత మని
ముందూ వెనుకలు తప్పవని
నీవన్నది నిజమే చెలీ!
ఈనాడు మరణ శయ్యపై
మృత్యువు నాకై పొంచియుండగా
చూపు పోయిన నాకు ధిక్సూచివినీవై
నాప్రక్కన ఎవరున్నారో చెప్పాలని
తహతహ లాడే నీ హృదయ ఘోషను
వినడానికి ,ఇదిగో వస్తున్నా
చెలీ,నీవెనుకేవస్తున్నా ............!!
జయచంద్ర గారూ ! మీ బ్లాగ్ కు చక్కటి పేరు పెట్టారు .....అభినందనలు . "నీవన్నది నిజమైనది" కవిత హృదయానికి హత్తుకునేలా చాలా బావుంది .
రిప్లయితొలగించండిభావావేశంతో మీరు వ్రాసిన ఈ కవిత నిజమే! ఆనాడు నీవన్నది
రిప్లయితొలగించండిఈనాడు నిజమైనది! చాలా బాగుంది.
అమ్మో!!! ఎంత బాగా వ్రాసారు....
రిప్లయితొలగించండిమీ కవితలకంటేనా,పద్మార్పితగారూ!
రిప్లయితొలగించండి