
మనసెందుకీ రోజు మసకబారింది
మలిరేయి గడిచినా నిదురరాకుంది!
పిసినారి దేముడు పిడికిటితో కొలిచి
చిల్లడ్డ మనసుని నాకిచ్చినాడు. !
మమతాను రాగాలు మంచినీళ్ళుగా మార్చి
మనసంతానింపేసి మాయమైపోయాడు!
చిల్లున్న మనసులో చన్నీరునిలుచునా
కన్నీరుగామారి గుండెంత తడిపింది. !
అరవైలొ నా మనసు ఖాళీగ అయ్యింది
ఒట్టిపోయినమనసు గట్టిగా మారింది!
మనసెందుకీరోజు మసకబారింది
మలిరేయి గడిచినా నిదురరాకుంది!
కన్నీరా ..కన్నీరా ...ఎందుకొస్తావూ....అంటే ..
రిప్లయితొలగించండిభారమైన గుండెను తేలిక పరిచేందుకు అందట ..
బావుందండీ .
naaku arthamina kavita edenandi baabu.....kontamandi raaste em artham kaadu............
రిప్లయితొలగించండిthanks parimalam and chakravarthigaaru
రిప్లయితొలగించండి