ఒక రాజ్యాన్ని ఉత్తుంగభుజ మహారాజు పరిపాలిస్తు ఉండేవాడు.అతనికి రాణీ మీద అవ్యాజమైన ప్రేమ. వారికి నందుడు అనే కుమారుడు ఉండేవాడు.ఆదేశానికి ప్రతి సంవత్సరము ఒక నగల వ్యాపారి వచ్చేవాడు.వచ్చిన వెంటనే రాణీ నివాసానికి వెళ్ళి ఆమెకు నగలు విక్రయించేవాడు.రాణీ బోణీ మంచిదని అతని అభిప్రాయం.రాణీ మీద ప్రేమతో, రాజు, రాణీ ఎన్ని నగలు కొన్నా ఏమీ అనేవాడు కాదు.
ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయింది.ఆ రాజు ఒక నాట్యగత్తె వలలోపడతాడు. క్రమంగా రాణీ ని దూరంగా ఉంచుతూ వేశ్యను దగ్గరికి చేర్చుకొంటాడు. రాణీకి, ఊరికి దూరంగా భవంతి కట్టి అక్కడ ఉంచు తాడు.నందుడు తో ఆమె అక్కడ ఉంటూ ఉంటుంది.
ఆసంవత్సరం నగలవర్తకుడు మళ్ళీ వస్తాడు.రాణీ విషయం తెల్సుకొని చాలా చింతిస్తాడు.రాణీవాసానికి వెళ్ళి నగలు కొనమని అడుగుతాడు.అందుకు రాణీ "అన్నా! నేనిప్పుడు నిర్భ్హాగ్యురాలను.భర్తను దూరంచేసుకొని గంపెడు ధుఖముతో బ్రతుకును ఈడ్చుచున్నాను.ఇప్పుడు నాకు పూర్వపు వైభవము లేదు.ఐశ్వర్యము లేదు.నీవద్ద నగలను కొన్ననూ డబ్బు ఇవ్వగల స్టోమత లేదు.కనుక ఓ అన్నా నేను నీ వద్ద నగలను కొనలేను." అందుకు వ్యాపారి " తల్లీ! నా కు డబ్బు ముఖ్యము కాదు.మీ పరిస్తితులకు నేను చాలా బాధ పడు తున్నాను.నాకిప్పుడు డబ్బులివ్వనవసరం లేదు.అప్పుగా ఇస్తాను. మీరుతర్వాత ఇవ్వవచ్చు.మీరు నా వద్ద నగలు కొంటే నాకంతేచాలు" కానీ నగలు కొనటానికి రాణీ ఒప్పుకోదు."మీ అప్పు తీర్చే అవకాశం కనుచూపుమేరలో కన్పించడంలేదు.అందుకని తీసుకోలేను." అంటుంది.
అప్పుడు రాణీ గారి దాసి ఆమెను పక్కకు పిలిచి ఇలా చెబుతుంది
" ఉత్తుంగభుజ నాశోవా
దేశ కాల గతోపివా
వేశ్యా,వణిగ్వినాశోవా
నందోరాజా భవిష్యతి!"
"ఉత్తుంగభుజ మహారాజు చనిపోవచ్చు.దేశకాలపరిస్థితులు మారిపోవచ్చు.వేశ్యగాని,ఈవర్తకుడు గాని చనిపోవచ్చు.భవిష్యత్తులోమన నందుడే రాజుకావచ్చు.వీటిలో ఏఒక్కటి జరిగినా ఈఅప్పు తీర్చటం మీకు సమశ్య కాదు. కాబట్టి వ్యాపారి మాటవిని నగలు అప్పు తీసుకోండి" ఈ కధ నుంచి వచ్చిన సామెతే ’నందోరాజాభవిష్యతి’ అన్నది.
జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
28, మార్చి 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా కవితలు
- నీవన్నది,నిజమైనది
- నీ వున్నావని
నా బ్లాగు లిస్ట్
బ్లాగు ఆర్కైవ్
నా గురించి
- jayachandra
- CHENNAI, TAMILNADU, India
- జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!
ధన్యవాదాలు. ఈకథ ఎలా వచ్చిందా అని నేను చాలాకాలంగా ఆలోచిస్తున్నాను. ఈకథ చంద్రగుప్తుడు నందుని రాజుగా చేస్తానని ప్రతిన పట్టినట్టు ఏదో లీలగా గుర్తు. ఇలాటికథే మరాఠీలో గుర్రం ఎగరావచ్చు అని ఒక నాటకం వచ్చింది మాచిన్నతనంలో. ఏకతయినా భవిష్యత్తుమీద నమ్మకాన్ని కలిగిస్తుంది. బాగుంది
రిప్లయితొలగించండిమంచి కధ.
రిప్లయితొలగించండినాకూ కధలంటే ఇష్టమండీ... ఏదో రాసేయ్యాలని ఖాళీ సమయంలో తెల్ల కాగితాలు నలుపు చేస్తుంటాను... కానీ ఇప్పటిదాకా ఒక్కటీ నాకు నచ్చే విధంగా రాయలేదు అనుకోండీ... :)
బ్లాగులోకంలోకి మీకు హృదయపూర్వక స్వాగతం. మీ బ్లాగు ఇంతింతై వటుడింతై అన్నట్లు దిన దిన ప్రవర్ధమాన మవ్వాలని కోరుకుంటున్నాను.
all the best :)
ఈకథ లో నీతి ఏమిటంటే వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకో కూడదు అని
రిప్లయితొలగించండిజయ చంద్ర గారూ ! మంచి మంచి కధలను ....వెలికి తీసి అందిస్తున్నారు ధన్యవాదములు .మీ బ్లాగు మరిన్ని మంచి కధలతో ప్రత్యేకతను సంతరించుకోవాలని ఆశిస్తున్నాను .
రిప్లయితొలగించండికృతఙతలు పరిమళం గారూ.ప్రయత్నిస్తాను.
రిప్లయితొలగించండిI have been always wondering where from this phrase has come. Thank you verymuch for the story.
రిప్లయితొలగించండి