7, మే 2009, గురువారం

నేనెందుకిలా--2


వంటింట్లో అమ్మ హడావుడిగా ఉంది.అన్నయ్య స్నానంచేసేసి స్కూలుకు రెడీఅవుతున్నాడు.చెల్లి అమ్మ వెనుకేతిరుగుతూ ఎందుకోమారాం చేస్తూంది.నాన్న వరండాలో గ్రిల్ల్సు ప్రక్కన కూర్చుని పేపరు చదువుకొంటున్నాడు.నేను గవర్నమెంటు స్కూలులో ఆరవ తరగతి చదువుతున్నాను.ఇంగ్లీషు మీడియం."బృందా! లేచావా?త్వరగా రెడీ అవ్వు.ఇప్పటికే ఆలశ్యమయ్యింది."అని నాకు చెప్పి చెల్లెలిపై కోప్పడుతూందెందుకో.అన్నయ్య ఏదోపని చేసుకొంటూ కనుకొలుకుల్లోంచీ నావైపు చూశాడు.అమ్మా నాన్నా వాడి కన్నా నన్ను బాగా చూసుకొంటారని వాడి అభిప్రాయం.అందుకే అప్పుడప్పుడూ అలా చూస్తూ ఉంటాడు. బాత్రూంవైపు పరిగెత్తాను.

స్నానంచేసియూనిఫాం వేసుకొని అన్నంతినడానికి రెడీగా డైనింగ్ టేబులు దగ్గరకు చేరాను.తొమ్మిదిన్నరకు స్కూల్లో ఉండాలి.ఈరోజు చెల్లి స్కూలుకు ఎగ్గొట్టేలా ఉంది. అది మాస్కూలులోనే నాలుగు చదువుతూంది.నాతోనేతీసుకెళతాను.ఒక రోజు వస్తే నాలుగు రోజులు రాదు.అన్నయ్య ,అన్నట్టు వాడిపేరు శివకుమార్.అందరూవాడిని శివా అని పిలుస్తారు.నాప్రక్కన కుర్చీలో వచ్చి కూర్చున్నాడు గంభీరంగా.-నేను నీకంటే పెద్ద అన్నభావం వాడి ప్రతి కదలికలోనూ కన్పింప చేస్తాడు వాడు.
పుస్తకాల సంచీతగిలించుకొని పరిగెత్తాను.మాస్కూలు నాలుగు వీధులవతల ఉంది.పెద్ద కాంపౌండులో పెద్ద బిల్డింగులో ఉంది మా స్కూలు.ఇది అమ్మాయిలకు ప్రత్యేకం.శివా, బాయిస్ స్కూల్లో చదువుతున్నాడు.కాత్యా,దీపికా,సింధుజా నా స్నేహితులు.నన్నుస్కూలు వైపుకు లాగే అయస్కాంతాలు వాళ్ళు.ప్రేయరుముగించి ఎవరి క్లాసులకు వారు వెళ్ళి కూర్చున్నారు.మేంనలుగురం ఒకే బెంచిలో కూర్చుంటాం ఎప్పుడూ.
ఈదినచర్య ఇలాగే సాగుతుంది రోజూ.కాకుంటేచిన్న చిన్న మార్పులతో.నేనెప్పుడూ క్లాసులో ఫస్టే.మా మిస్సులు నేనెలారాసినామార్కులు వేస్తారేమో! సింధుజ నాకంటే బాగా చదువుతుంది .కానీమార్కులే రావెందుకో.కాత్యా,దీపికలు చదువులో కొంచెం వీక్.స్కూలు ఐపోయిన తర్వాత మేమెప్పుడూ చదువు గురించి మాటాడుకొనేవారంకాదు.అంతా ఆటలే!అప్పుడప్పుడూ సినిమా డాన్సులు కూడా వేసేవాళ్ళం.
బిజీ బిజీగా క్షణం తీరిక లేకుండా సాగిపోతున్న నా బాల్యంలో ఇంత సంతోషం దాగి ఉందని నాకు అప్పుడు తెలీలేదు.అందరికీ ఇలాగే ఉంటుందనుకొన్నాను.కానీ కొందరి బాల్యం విషాదంగాకూడా ఉంటుందని నిశ్చల పరిచయమయ్యేవరకూ నాకు తెలీనే తెలీదు.
నిశ్చ్లల మాస్కూల్లో కొత్తగా చేరింది.మాక్లాసే! మొదటి రోజే మా గ్రూపులో చేరి పోయింది.తన పేరులాగే అమ్మాయి దేనికీ తొణకదు,
బెణకదు.చాలా సైలెంటుగా ఉండేది.మాగ్రూపులోని మిగతాముగ్గురికంటే నామనసుకు బాగా దగ్గరయ్యింది నిశ్చల.అలా కాకున్నా బాగుండేదని ఇప్పుడనిపిస్తూంది............

1 వ్యాఖ్య:

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు జాబితా

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    9 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!