8, మే 2009, శుక్రవారం

నేనెందుకిలా -3


అందచందాలను గురించి నాకప్పుడు పెద్దగా తెలీదు గానీ ఇప్పుడనిపిస్తూంది,నిశ్చల చాలా అందంగా ఉండేదని.
నాది సాధారణ మైన అందం అనుకొంటాను.ఆడపిల్లలు అందంగా ఉండాలని నా కప్పట్లో తెలీదు.నేనెప్పుడూ అందాలకు మెరుగులు పెట్టుకొన్న గుర్తు లేదు.నిశ్చల కూడా పెద్దగా అలంకరించుకోదు కానీ సహజంగానేఅందంగా ఉండేది.
ఓరోజు మాగ్రూపు అంతా సర్కసుకువెళ్ళాలని ప్లాను వేసుకొన్నాం.మరోఇద్దరు ఫ్రెండ్సుమాతో కలిశారు.కానీ చిన్న పిల్లలం కదా! పెద్దవాళ్ళ తోడు లేకుండా ఎలా పోవటం.అందరం ఇళ్ళల్లో మా కోరిక వెళ్ళడించాము.చివరకు సింధుజ నాన్న గారు మాతోవచ్చేట్టు నిర్ణయమైపోయింది.మేమంతా సంతోషంగా స్కూలునించీ ఇళ్ళకు చేరుకొన్నాము. ఆరుగంటలకు షో.అందరంరెడీ అయి సింధుజ ఇంటికి చేరిపోయాం. నిశ్చల కొంచెంఆలశ్యంగా చేరింది.వాళ్ళనాన్న బైకులోతీసుకువచ్చి వదలి వెళ్ళాడు.ఆరోజు నిశ్చలను చూస్తే నాకే చాలా ముచ్చటేసింది.సింపుల్ గా తయారయ్యింది కానీతీర్చి దిద్దినట్టున్న ముఖం కడిగిన ముత్యంలాగా స్వచ్చంగా ఉంది.
ఆడపిల్లలందరం రంగు రంగుల బట్టలేసుకొని గోల గోల గా సర్కసుకు బయలుదేరాం, రెండు ఆటొల్లో.శింధుజ నాన్నగారు
(పేరు సరిగా గుర్తులేదు)ఆటోడ్రైవర్లకు ఏవో ఇన్స్ట్రక్షన్లు ఇచ్చ్డాడు.ఆటోలువేగంగా దూసుకెళ్తున్నాయి.......
సర్కసు టెంటు దగ్గరకు చేరుకొన్నాము.సింధుజ నాన్నగారు కౌంటరు దగ్గరకు వెళ్ళాడు,టిక్కెట్లు తేవటానికి.
అందరం కోలాహాలంగా లోపలకు జొరబడ్డాము.హాలంతా అప్పటికేనిండి పోయి ఉంది.ముందువరసలుమాత్రం కొన్ని ఖాళీలు ఉన్నాయి.
అందరం మూడోవరసలో కూర్చున్నాము.సింధుజ నాన్నగారు చివరలో కూర్చొన్నారు.తర్వాత సింధుజ,ప్రక్కన నేను,నాప్రక్క నిశ్చలఅలా కూర్చొన్నాము.
షో ఆరంభమయ్యింది.రకరకాలవిన్యాసాలనుఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నాము.నిశ్చలయితే నాచేయి పట్టుకొనిగట్టిగా నొక్కేస్తూంది టెన్శనుతో.హాల్లోసగానికిపైగా చిన్నపిల్లలేఉన్నారు.జోకరు చేష్టలకు అందరం పెద్దగానవ్వుతున్నాము.సందడిసందడిగాఉంది. నిశ్చ్లల నాచెవి దగ్గరకు వంగి మెల్లగా చెప్పింది."థాంక్స్ బృందా! ఈప్రోగ్రామ్ పెట్టినందుకు.నాకు చాలా సంతోషంగా ఉంది."
నా చేతిని ఆప్యాయం గా నొక్కింది.అంత సంతోషంలోకూడా నాకళ్ళు చెమర్చాయి.
ఒక పెద్ద ఏనుగు స్టేజీ మీదకు వచ్చింది.అది మావటి వాడు చెప్పినట్టు వింటూంది.చివర్లో నాలుగుకాళ్ళు ఒక పెద్ద బంతిమీదపెట్టి నిలబడినప్పుడుఅందరూసీట్లలోంచీలేచి చప్పట్లు కొట్టారు.అరుపులతోహాలు మార్మోగిపోయింది.కోతుల చేష్టలు సరేసరి.అందరినీ కడుపుబ్బా నవ్వించాయి.అప్పుడు ఒక పులిని స్టెజీ మీదకు తీసుకొనివచ్చారు.ఒకతను చేతిలో జాటి తో దాన్నిఅదిలిస్తున్నాడు. అతన్ని ఏమంటారో నాకు అప్పుడేకాదు,ఇప్పటికీ తెలీదు.పులి విన్యాసాలు ప్రారంభించింది.అతను చెప్పినట్టు వింటూందది.ఒక ఆడపిల్ల వచ్చి పులి నోట్లో తల పెట్టి ఒకనిమిషం సేపుంచినప్పుడు హాలంతా నిశ్శబ్ధమైపోయింది.అందరూ భయ భ్రాంతులై కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూండి పోయారు.
ఆమె తల బయటకు తివ్వగానే చప్పట్లతో హాలు మార్మ్రోగిపోయింది. సింధుజ ఒకప్రక్క,నిశ్చల మరోప్రక్కా నా చేతులు పట్టుకొని గట్టిగా నలిపివేశారు.పులి ఫీట్సు అయిపోవచ్చాయి.ఆజాటీ పట్టుకొన్నతను ప్రేక్షకులవైపు తిరిగి అభివాదం చేస్తున్నాడు.అతని వెనుక పులి నిల్చుని ఉంది.దాని కళ్ళు ఎర్రగా అగ్ని గోళాల్లాఉన్నాయి.అది నోరంతా తెరిచి భయంకరంగా అరిచిందోసారి.ఆ శభ్ధానికి హాలు దద్దరిల్లి పోయింది.పులి చెంగున ఒక్కగెంతు గెంతి క్రిందకు దూకేసి ప్రేక్షకుల్లోకి పరుగెత్తింది.......

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!