22, మే 2009, శుక్రవారం

కన్నీటి తో కాసులు.......



కన్నీటి తో కాసులు సంపాదిం చటమెలాగో మీ కెవరి కన్నా తెలుసా !
తెలీకపోతే డబ్బు సంపాదనలో మీరు చాలా వెనుక పడి ఉన్నట్లే .
ఎలాగో తెలుసుకొందాం నాతో రండి!ముక్కున వేలేసుకోవటానికి సిద్దం కండి!
ఇక వెళ్దామా ...ఒన్,టూ,త్రీ ......
ఎవరికై నా ఓటమి ఎదురైనప్పుడు మనసు పాడవుతుంది .ఎవ్వరినీ చూడాలని పించదు.
ఒంటరిగా ఉండాలని అన్పిస్తుం ది.కనీసం కొద్ది రోజు లు స్నేహితులుకు కూడాదూరంగా ఉండాలని కోరుకొంటాము.
ఇది సహజం. పెద్దలకైనా,పిల్లలకైనా!
ఎలక్షన్ రిసల్టు లు వచ్చిన తర్వాత కెసిఆర్ ,ముహం చాటేయడానికీ,అల్లు అరవింద్ అడ్రసు లేకపోవటానికి
ఇదే కారణం.క్రికెట్ లో ఓడిన జట్టు కెమరాకు ముఖం చాటేస్తుంది.వాళ్ళను తప్పుపట్టలేం. ఇది మానవ సహజం.
పెద్దవాళ్ళకే ఇలా ఉంటే ఇక పిల్లల సంగతేమిటి?ఎంత డిప్రెషనుకు లోనవు తారు?
కొన్ని చానల్సు లో పిల్లలకు పాటల పోటీలు నిర్వహిస్తున్నారు.మంచిదే.
ఆ పోటీలోఓడిపో యిన పిల్లలు కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు.
ఆక్షణాలు చానల్ స్వంత దారులకు ఎంతో విలువైనవి.కాసులు రాల్చేవి.
కెమరా లన్నీ జూం అవుతాయి,ఏడ్చే పిల్లల ముఖం మీదికి .
గెలిచిన వాళ్లు మనకు కనిపిం చరు.పాపం!ఎందుకు గెలిచామా అని ఓ మూలన నిల్చుం టారు.
వారుకాదు మనకు కావలసింది.వారి కళ్ళల్లో మెరిసే మెరుపు ఎవరికి కావాలి?
ఓడిన వారి కళ్ళల్లో నీరు మనకు ముఖ్యం.ఎంత ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారు,ఎంతకన్నీరుకారుస్తున్నారు?
ఏ యాంగిల్ లో నుంచి ఎక్కువ కన్నీరు చూపించవచ్చు ,అది ముఖ్యం.
కేమరాలన్ని ఏడ్చే పిల్లల ముఖం మీదే !ఎంత శాడిజం!
స్కూలు పరీక్షలో ఫెయిలయి తే ఆత్మ హత్యల దాకా పోయే సున్నిత మనస్కులు పిల్లలు.
వారి పరాజయాన్ని సొమ్ము చేసుకోవాలను కొనే వాళ్ళను ఏమనాలి?
మనకు కడుపులో దేవినట్టు ఉంటుంది.నిజమే.నాకనిపిస్తుంది.ఈ పోటీలన్నీ ఓడేవారి కోసమేనేమోనని .
ఏరి! గెలిచిన వారెక్కడ?ఇదంతా చదువు తుం టే మీకు కడుపు లో ఎలాగో ఉందా?
అయినా సరే!కన్నీటి తో కాసులు సంపాదిం చట మెలాగొ తెలిసిందిగా ! అంతే చాలు!!!!

కొసమెరుపు .....
అడ్వర్ టైస్మెంట్...’వచ్చేవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో (ఎంతకన్నీరు కారుస్తారో)తప్పక చూడండి
లేత కన్నీరు రుచి మరిగిన మనం అన్ని రోజులు ఎలా వేచియుండడం?

3 కామెంట్‌లు:

  1. నేను ఆ పోటీలు చూసినప్పుడు ఇలాగే ఫీల్ అవుతాను. ఏడ్చే పిల్లలని ఫోకస్ చేసి చూపించే వాళ్ళమీద పిచ్చి కోపం వస్తుంది...కాసులే కాని కన్నీళ్ళతో పనిలేదు వాళ్ళకి.

    రిప్లయితొలగించండి
  2. ప్చ్ .....ఏం చేయగలం మనం ? ప్రోగ్రాంని చూడటం మానేయటం తప్ప !

    రిప్లయితొలగించండి
  3. పద్మార్పిత గారూ ధన్యవాదాలు. పసిపిల్లలను లీగల్ గా ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నవారిని గురించి నేను వ్రాస్తున్న వ్యాసాల్లో ఇది రెండవది.
    నా స్పందనలు లేబుల్ లో వున్న రచనలు చదవండి..పరిమళం గారూ !అలా వదిలేస్తే ఎలా! ఏదో ఒకటి చెయ్యాలి.చూద్దాం.దారిదొరుకుతుందేమో!

    రిప్లయితొలగించండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!