జీవితం లో కష్ట సుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహ వీచికల పులకింతలు అనుభవైకవేద్యం. ఇక తెలుసుకోవలసింది ఒక్కటే! నా బ్లాగుమిత్రుల మనసు. జయచంద్ర
20, మే 2009, బుధవారం
కసబ్ నవ్వాడు
కసబ్ నవ్వాడు.
'ఎక్కడిదీ లత్తకోరు జ్ఞానమని'
ప్రపంచం లో మరే సమస్యా లేనట్లు
మనం బుర్ర బద్దలు కొట్టు కొంటుంటే
నత్త నడక నడుస్తున్న మన న్యాయ వ్యవస్థను చూసి
కసబ్ నవ్వాడు!
రాజీవ్ గాంధి పోయినప్పుడు మొదలై
ప్రభాకరన్ పోయినా తేలని కేసును చూసి
తీర్పులివ్వకుండా నిద్రలో జోగుతున్న జడ్జీలను చూసి,
న్యాయ వాదుల సమ్మెలతొ మూతలు పడుతున్న కోర్టులు చూసి,
మేడులు పడుతున్న కేసులు చూసి ,
తారుమారవుతున్న సాక్షులను చూసి,
కసబ్ నవ్వాడు!
తంతే బురెలబుట్టలో పడ్డట్టు
భారత దేశం లో పడ్డ తన అదృష్టం తలచుకొని ,
కసబ్ నవ్వాడు!
పట్టుబట్ట మొదట్లో చంపెయ్యమన్న తన ముర్ఖత్వాని తలచుకొని,
తన జీవితానికిక డోకా లేదని తెలుసుకొని,
కోపంతో ముద్దుగా మందలిస్తున్న జడ్జీలను చూసి
గారాం చేస్తూ , మారాం పొతూ ,
మళ్ళీ కసబ్ నవ్వాడు!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నా కవితలు
- నీవన్నది,నిజమైనది
- నీ వున్నావని
నా బ్లాగు లిస్ట్
నా గురించి
- jayachandra
- CHENNAI, TAMILNADU, India
- జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!
Nenu Edchaanu :((
రిప్లయితొలగించండిthere is a problem in your blog. It is not allowing copy&paste in the comment section.
రిప్లయితొలగించండి"అంతులే"ని సందేహాలతో కల్లముందున్న నిజాన్ని చూడలేని గుడ్డివారిని చూసి కసబ్ నవ్వాడు.
రిప్లయితొలగించండిఇంత తీవ్ర సమస్యైన తనను పక్కన పెట్టుకుని మన లౌకికవాదులు
పిల్లచేపల మీద తమ ప్రతాపం చూపిస్తుంటే ...కసబ్ నవ్వాడు.
తమలాంటి వారు దాడి చేసినప్పుడల్లా.. భారతదేశం ఇటువంటి దాడులను సహించబోదని హూంకరించడమే తప్ప దానికి కారకులైన ఇంటిదొంగల విషయంలో, మెతక వైఖరితో ఉదారావాద రాజకీయాలు ప్రదర్షిస్తుంటే చూసి కసబ్ నవ్వాడు.
నెలకొక పట్టణం దాడులతో అట్టుడికి పోతుంటే, ఏమిచేయలేక మర్నాడు, నగరం గెలిచింది అని పత్రికలలో ప్రకటించుకుని మరిచిపోయే మనల్ని చూసి, మన చాతాకాని తనాన్ని చూసి కసబ్ మల్లీ మల్లీ నవ్వాడు.
Good one.
రిప్లయితొలగించండిavunu
రిప్లయితొలగించండిSuper :-), కానీ నవ్వలేక భారతీయుడుగా ఏడవాలేమో!
రిప్లయితొలగించండిemichestaamu? bhaaratadesamamte amta chulakanaipoyinadi prativaaniki
రిప్లయితొలగించండిస్పందించిన అందరికీ ధన్యవాదములు.
రిప్లయితొలగించండిsuperb poetry,bhaava vyaktiikaraNa ,Saili adbhutaM!
రిప్లయితొలగించండిmana kuLLu raajakiiya vyavasthanu chuusi,O bhaarii niTTUrpu.
hhuuUUUUUUuuuuuuuuuuuuuuu ............. !pch^!.............!