8, మే 2009, శుక్రవారం

నేనెందుకిలా -4


అంతే హాలంతా గందరగోళమైపోయింది.అందరూలేచి పరుగెత్తసాగారు.జనమంతా చెల్లచెదురై పోయారు.ఆతొక్కిసలాటలో ఏంజరుగుతోందోతెలీటం లేదు.ఎవరు ఎక్కడున్నారో అర్ధంకావటంలేదు.పులిపిచ్చిపట్టినట్టు నాలుగు మూలలకూ పరుగెడుతూంది.చిన్నపిల్లలు పెద్దవాళ్ళకాళ్ళక్రింద పడి నలిగిపోతున్నారు.సింధుజ నాన్నగారు సింధుజను ఎత్తుకొని బయటకు పరుగెట్టేశాడు.నేను నిశ్చల చేతిని గట్టిగా పట్టుకొన్నాను.మాప్రెండ్సందరినీ అలాగే ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొమ్మని గట్టిగా అరిచి చెప్పాను.పులి అన్ని దిక్కులూతిరుగుతూ మావైపు దూసుకు రాసాగింది.అందరం పెద్దగా యేడుస్తున్నాం. జీవితంలో ఇధే ఆఖరు రోజేమో -నా మాటలు వినివీరంతా సర్కసుకు వచ్చారు.
నా ప్రాణాలు పోయినా ఫర్వాలేదు.వీరిని కాపాడాలి.నాలో వెర్రి ఆవేశం ప్రవేశించింది.అంతే! ఎటువంటిపరిస్తితుల్లోను చేతులు వదలవద్దనిఅరిచి చెప్పాను.వేగంగా ద్వారం వైపు పరుగెట్టాను.సర్కసు నిర్వాహకులందరూ వలలు పట్టుకొని రంగంలోకి దిగారు.పులిని పట్టటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.మేము ఎలాగో బయట పడి పోయి టెంటుకు దూరంగా పరుగు లంకించుకొన్నాము


*** *** ***
ఆరోజు ఈవినింగ్ పేపర్లలో అంతా ఇదే న్యూసు.సర్కసు నిర్వాహకులను పోలీసులు అరెస్టు చేశారు.
అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఇద్దరు పిల్లలు చనిపోయారు.వింత ఏమిటంటే పులి ఒక్కరిని కూడా చంపలేదు.మా వీధంతా ఒకటే గోలగా ఉంది.
నా ఫ్రెండ్స్ పేరెంట్సు వచ్చి నాకు థాంక్సు చెప్పారు.సింధుజ తండ్రి గారిని అందరూతిడుతున్నారు,చిన్నపిల్లలను వదిలేసి తనదారిన తాను పరిగెత్తి పోయినందుకు.అతను చేసింది తప్పో రైటో అప్పుడు నాకు తెలీలేదు.ఆతర్వాత ఆవిషయం నేనాలోచించలేదు.---
రెండవరోజు స్కూలులో అంతా ఇవే కబుర్లు. టీచర్సందరూ నన్నభినందించారు.సింధుజ మాత్రం దూరదూరంగా ఉంది, బహుశా వాళ్ళ నాన్న చేసిన పనికి సిగ్గు పడుతూందేమో! కానీమేము ముందే అనుకొన్నాము సింధుజదగ్గరఎవరూ విషయంఎత్తగుడదని .సాయంత్రం అందరూఇళ్ళకు వెళ్ళేముందు సింధుజ నాదగ్గరకు వచ్చింది.దానికళ్ళు బాగా వాచి వున్నాయి.ఎర్రగా మంకెన పూవుల్లాగా ఉన్నాయి."సారీ బృందా! మానాన్న అలా చేసి ఉండ కూడదు..." ఏడుపు తో దాని గొంతు పూడుకు పోయింది.
నేను దాని భుజాలు గట్టిగా పట్టుకొని నా కేసి హత్తుకొన్నాను. ఆహా! స్నేహబంధం ఎంత మధురమైనది.నా కళ్ళల్లోంచీజారిన కన్నీరు దాని భుజాలు తడిపేసింది.ఈసంఘటన మా అందరిమధ్యన ఉన్న స్నేహ భంధాన్ని ఇంకా పటిష్టంచేసింది.
ఒక ఆదివారం నిశ్చల నన్ను వారింటికి ఆహ్వానించింది.రోజంతా ఉండేట్టు రమ్మంది.ఇంకెవ్వరినీపిలవలేదు.
కానీ ఆదివారం నాజీవితగమనాన్ని మార్చివేస్తుందనీ,సాఫీగా సంతోషంగా సాగిపోతున్న నా జీవితంలో ఆలోచనా తరంగాలను రేపుతుందనీ,నిశ్చలను నా ప్రాణ సఖిని చేస్తుందనీ ఊహించలేకపోయాను.
అందుకే ఆహ్వానాన్ని అంగీకరించాను..........
మిగిలిన భాగాలకోసం   ఇక్కడ  నొక్కండి 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!