30, మార్చి 2009, సోమవారం

చైల్డ్ లేబర్

పసిపిల్లలను పనికిపంపి డబ్బు సంపాదించకూడదంటే మంచిదే అనుకొన్నాను. అందుకొక చట్టం తెస్తే ఇంకా సంతోషించాను.పిల్లలను పనిలో పెట్టుకొనేవాళ్ళను శిక్షిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తే , పర్లేదు మనదేశంలో కూడా కొంచెం మంచి జరుగుతోందని త్రుప్తి పడ్డా ను. ఇంకా చిన్నపిల్లలపై సెక్సువల్ హరాస్మెంటులు , రేపులు చేసేకిరాతకులుపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంటే భారత దేశంలో చాలా మంచి జరుగుతోందని నాహృదయం ఆనందంతో ఎగిరి గంతేసింది.
కానీ ఎంతసేపు?
రాత్రి టీవీలో ఫలానా చానల్ చూస్తూకూర్చున్నాను.ఒకప్రోగ్రాము చూస్తున్న నేను నిశ్చేష్టుడినైపోయాను. నా నోట్లో తడారిపోయింది.ఒళ్ళంతా చెమటలుపట్టేసింది.జూనియర్స్ డాన్సు ప్రోగ్రామట.ఒక ఎనిమిదేళ్ళపాప డ్రాయరు బనీను వేసుకొని "అప్పటికింకా నావయసు నిండా పదహారే...." అన్న రికార్డుకు గెంతులేస్తూంది.
అంతచిన్నపిల్ల వయసుకు మించిన హావభావాలు చూపిస్తూంది.ఎలాగైనా ప్రైజు తెచ్చుకోవాలన్న కసి ఆ పాప ముఖంలో కనిపిస్తూంది. ముగ్గురు జడ్జీలు భలేచేశావనిఆపాపను పొగడ్తలతో ముంచేస్తున్నారు.జడ్జిమెంటు ఇవ్వడానికి వీరికి వున్న అర్హతలేమిటి? నిన్నటివరకు అర్ధనగ్నంగా సినిమాల్లో గెంతులేసినవారు ఈరోజు న్యాయనిర్నేతలా ?
నా మనసును తొలుస్తున్న ప్రశ్న " పసిపిల్లలు పనిచేయగూడదు గాని అర గొర బట్టలేసుకొని రికార్డు డాన్సులు చెయ్యవచ్చా?"ఈపోటీకి జడ్జీలా ? బాగాఎగిరినవాళ్ళకు ప్రైజులా? ఈప్రోగ్రాము కోసంఎంతమంది పిల్లలు భవిష్యత్తులు నాశనమౌతున్నయి?చదువులు మంట కలుస్తున్నాయి?భారతమాతా! నీపిల్లలను నువ్వే రక్షించుకోవాలమ్మా!
కనులు మూసుకొని ఆలోచిస్తున్నాను నేను...........

6 కామెంట్‌లు:

  1. baagundi andi ...mee abhipraayaala too nenu ekibhavistunnanu.......
    mee NARESH THURPINTI
    nareshrgukt23@gmail.com

    రిప్లయితొలగించండి
  2. చాలబాగాఉందండి. నేనూ మీతో ఏకీభవిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. జయచంద్ర గారూ ! మీతో నేనూ ఏకీభవిస్తాను . కానీ ఏంచేయగలం చూసి బాధపడటం తప్ప .చానల్ రేటింగ్ పెంచుకోవడం తప్ప పిల్లల గురించి ఆలోచించేదెవరు ? విచిత్రం ఏవిటంటే పిల్లల కంటే వారి తల్లితండ్రులే ఎక్కువ ఎమోషనల్ గా రియాక్టవుతున్నారు. అంతకంటే ఘోరం మెంటర్స్ అనబడే ముగ్గురూ అసహ్యంగా తిట్టుకోవడం , ఏడవడం. అసలు మళ్ళీ ఆ ప్రోగ్రాం చూడకూడదని నిశ్చయించుకున్నా !

    రిప్లయితొలగించండి
  4. ఈ పరిస్థితులను మనం మార్చలేమా పరిమళం గారూ! అలాంటి డాన్సులను చట్టం ద్వారా బహిష్కరించలేమా?
    కనీసం ప్రయత్నించలేమంటారా?

    రిప్లయితొలగించండి
  5. జయ చంద్ర గారు , చట్టం గురించి నాకంతగా తెలీదు . కాని మరీ ఘోరంగా స్మైల్ పింకీ లో అమ్మాయిని ఎన్నికల ప్రచారానికి ఉపయోగించు కోవడం ...ఇంకా పద్నాలుగేళ్ళ లోపు పిల్లలతోనే మీడియాలోవారి వారి పార్టీల విధానాల్ని ( ex: c for) ప్రచారం చేయించుకుంటున్నారు ...మరి ఎవరేం చేయగలుగుతున్నారు ?

    రిప్లయితొలగించండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!