20, మే 2009, బుధవారం

కసబ్ నవ్వాడు


కసబ్ నవ్వాడు.
'ఎక్కడిదీ లత్తకోరు జ్ఞానమని'
ప్రపంచం లో మరే సమస్యా లేనట్లు
మనం బుర్ర బద్దలు కొట్టు కొంటుంటే
నత్త నడక నడుస్తున్న మన న్యాయ వ్యవస్థను చూసి
కసబ్ నవ్వాడు!
రాజీవ్ గాంధి పోయినప్పుడు మొదలై
ప్రభాకరన్ పోయినా తేలని కేసును చూసి
తీర్పులివ్వకుండా నిద్రలో జోగుతున్న జడ్జీలను చూసి,
న్యాయ వాదుల సమ్మెలతొ మూతలు పడుతున్న కోర్టులు చూసి,
మేడులు పడుతున్న కేసులు చూసి ,
తారుమారవుతున్న సాక్షులను చూసి,
కసబ్ నవ్వాడు!
తంతే బురెలబుట్టలో పడ్డట్టు
భారత దేశం లో పడ్డ తన అదృష్టం తలచుకొని ,
కసబ్ నవ్వాడు!
పట్టుబట్ట మొదట్లో చంపెయ్యమన్న తన ముర్ఖత్వాని తలచుకొని,
తన జీవితానికిక డోకా లేదని తెలుసుకొని,
కోపంతో ముద్దుగా మందలిస్తున్న జడ్జీలను చూసి
గారాం చేస్తూ , మారాం పొతూ ,
మళ్ళీ కసబ్ నవ్వాడు!

9 కామెంట్‌లు:

  1. there is a problem in your blog. It is not allowing copy&paste in the comment section.

    రిప్లయితొలగించండి
  2. "అంతులే"ని సందేహాలతో కల్లముందున్న నిజాన్ని చూడలేని గుడ్డివారిని చూసి కసబ్ నవ్వాడు.

    ఇంత తీవ్ర సమస్యైన తనను పక్కన పెట్టుకుని మన లౌకికవాదులు
    పిల్లచేపల మీద తమ ప్రతాపం చూపిస్తుంటే ...కసబ్ నవ్వాడు.

    తమలాంటి వారు దాడి చేసినప్పుడల్లా.. భారతదేశం ఇటువంటి దాడులను సహించబోదని హూంకరించడమే తప్ప దానికి కారకులైన ఇంటిదొంగల విషయంలో, మెతక వైఖరితో ఉదారావాద రాజకీయాలు ప్రదర్షిస్తుంటే చూసి కసబ్ నవ్వాడు.

    నెలకొక పట్టణం దాడులతో అట్టుడికి పోతుంటే, ఏమిచేయలేక మర్నాడు, నగరం గెలిచింది అని పత్రికలలో ప్రకటించుకుని మరిచిపోయే మనల్ని చూసి, మన చాతాకాని తనాన్ని చూసి కసబ్ మల్లీ మల్లీ నవ్వాడు.

    రిప్లయితొలగించండి
  3. Super :-), కానీ నవ్వలేక భారతీయుడుగా ఏడవాలేమో!

    రిప్లయితొలగించండి
  4. emichestaamu? bhaaratadesamamte amta chulakanaipoyinadi prativaaniki

    రిప్లయితొలగించండి
  5. స్పందించిన అందరికీ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  6. superb poetry,bhaava vyaktiikaraNa ,Saili adbhutaM!
    mana kuLLu raajakiiya vyavasthanu chuusi,O bhaarii niTTUrpu.
    hhuuUUUUUUuuuuuuuuuuuuuuu ............. !pch^!.............!

    రిప్లయితొలగించండి

నా కవితలు

  • నీవన్నది,నిజమైనది
  • నీ వున్నావని

నా బ్లాగు లిస్ట్‌

  • - ఎవరో నా ముక్కు దగ్గర వేలు పెట్టి చూశారు."ఇంకా ఊపిరి ఉంది" అని చెప్తున్నారు. వీళ్ళంతానా చావు కోసం ఎదురు చూస్తున్నారు.నన్ను త్వరగా రధం మీదకు ఎక్కించాలి. ఎవరో ...
    14 సంవత్సరాల క్రితం

నా గురించి

CHENNAI, TAMILNADU, India
జీవితంలో కష్టసుఖాల బరువు తెలుసు. ప్రేమానురాగాల మాధుర్యం తెలుసు. స్నేహవీచికలపులకింతలు అనుభవైకవేద్యం ఇక తెలియవలసిందెల్లా ఒకటే నా బ్లాగు మిత్రుల మనసు!